మీ పప్పులేం ఉడకవ్.. టీమిండియాతో మ్యాచ్పై పాక్ కండీషన్లను కొట్టి పారేసిన ఐసీసీ

మీ పప్పులేం ఉడకవ్.. టీమిండియాతో మ్యాచ్పై పాక్ కండీషన్లను కొట్టి పారేసిన ఐసీసీ

లాహోర్: టీ20 వరల్డ్ కప్లో టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) పెట్టిన 3 డిమాండ్లను ఐసీసీ కొట్టిపారేసింది. పాకిస్తాన్ ప్రతిపాదించిన ఏ ఒక్క డిమాండ్పై ముందుకెళ్లేది లేదని PCBకి ICC స్పష్టం చేసింది. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ను పునరుద్ధించాలని ఐసీసీ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కండీషన్ పెట్టింది. అంతేకాదు.. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్.. ఈ మూడు జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని కూడా ఐసీసీ ముందు ప్రతిపాదన ఉంచింది.

అంతేకాదు.. ఈ సిరీస్ కోసం సెప్టెంబర్లో టీమిండియా బంగ్లాదేశ్ వెళ్లాలని PCB డిమాండ్ చేసింది. ఈ మూడు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని టీమిండియాను ఆదేశించే అధికారం తమకు లేదని.. ఈ అంశం తమ పరిధిలో లేదని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. బీసీసీఐకి మాత్రమే ఈ అధికారం ఉందని.. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీసీసీఐ నడుచుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గుర్తుచేసింది. 

►ALSO READ | వామ్మో.. జింబాబ్వే జట్టు ఎప్పుడూ డేంజరే.. పసికూన ఒమన్ను ఎలా ఓడించారో చూడండి !

లాహోర్‌లో జరిగిన ఈ సమావేశం తర్వాత.. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాలో.. లేదో తేల్చుకుని తుది నిర్ణయం చెప్పేందుకు పాకిస్తాన్కు ఐసీసీ ఒక్క రోజు సమయం ఇచ్చింది. PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కలవనున్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం ఫిబ్రవరి 9న రాత్రికి గానీ మంగళవారం ఉదయానికి గానీ పాకిస్తాన్ వెల్లడించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ జరగాల్సి ఉంది.