హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, యూసఫ్ గూడ్, కూకట్ పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ , నారాయణగూడ , అబిడ్స్ , కోఠి , బషీర్ బాగ్ , ట్యాంక్ బండ్ , చిక్కడపల్లి , ముషీరాబాద్ , సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
బోడుప్పల్, పిర్జాదిగూడ,నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ, చిలకానగర్, రామంతాపూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ముసురు పెడుతోంది.
రాగల మరికొద్ది గంటల్లో కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పరిస్థితిని సమీక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటు డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలు కూడా రంగంలోకి దిగి నీటి నిల్వలను క్లియర్ చేసే పనిలో పడ్డాయి.
