రోహిత్ రిటైర్మెంట్‌పై గిల్ క్లారిటీ.. హిట్‌మ్యాన్ ఫ్యూచర్‌పై బిగ్ అప్‌డేట్!

రోహిత్ రిటైర్మెంట్‌పై గిల్ క్లారిటీ.. హిట్‌మ్యాన్ ఫ్యూచర్‌పై బిగ్ అప్‌డేట్!

Rohit Sharma Retirement: తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు భారత స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన స్టైల్లో బ్యాట్‌తోనే అదిరిపోయే సమాధానం చెప్పాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్లాస్ బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది.

లార్డ్స్ కోటలో రోహిత్ హిస్టరీ: 
ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ మార్కును అందుకున్న తొట్ట తొలి భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. విమర్శలు చేసిన వారందరి నోళ్లు మూయిస్తూ, ఒత్తిడిలో హిట్ మ్యాన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుంది. 

రిటైర్మెంట్ టాక్?.. గిల్ క్లారిటీ: 
లార్డ్స్‌లో అద్భుతమైన సెంచరీ కొట్టిన తర్వాత రోహిత్ శర్మ వన్డే మ్యాచ్ కి వీడ్కోలు (Retirement) పలుకుతాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, ఈ రూమర్స్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ వేశాడు. జట్టులో అసలు అలాంటి చర్చే జరగలేదని స్పష్టం చేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ భాయ్ మాతో ఎప్పుడూ అనలేదు.. ఇదంతా నెట్టింట కొందరు కావాలని ఈ చర్చ స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పటి వరకు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ గురించిన మాటే రాలేదు.. గత కొనేళ్లుగా రోహిత్,- విరాట్ తమ అద్భుతమైన ఆటతో ఇండియాని ముందుకు నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ కలిసి కిరాక్ పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేశారు. రెండో ఇన్నింగ్స్ టైమ్‌లో పిచ్ చాలా స్లోగా మారిపోయింది, అక్కడ రన్స్ చేయడం చాలా కష్టం. కానీ అలాంటి పిచ్‌పై రోహిత్ భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అద్భుతం అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 

మ్యాచ్ చేజారింది అక్కడే.. తప్పు ఒప్పుకున్న కెప్టెన్: 
ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మూడో వన్డేలో ఓటమిపై గిల్ మాట్లాడాడు. మేము బౌలింగ్‌లో ఇంకొన్ని రన్స్ తక్కువ ఇవ్వాల్సింది. నిజానికి 45వ ఓవర్ వరకు మేము సరైన ట్రాక్‌లోనే ఉన్నాం, మ్యాచ్ మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆ తర్వాతే లైన్ అండ్ లెంగ్త్ కాస్త గాడి తప్పింది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారీగా రన్స్ ఇచ్చేయడంతో మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది. అయినప్పటికీ బ్యాటింగ్‌లో మా వాళ్లు చివరి వరకు గట్టిగానే పోరాడారని గిల్ వెల్లడించాడు.