శరద్ పవార్‌కు అస్వస్థత: పూణే ఆసుపత్రిలో చేరిక, భయపడాల్సిన పనిలేదన్న డాక్టర్లు...

శరద్ పవార్‌కు అస్వస్థత: పూణే ఆసుపత్రిలో చేరిక, భయపడాల్సిన పనిలేదన్న డాక్టర్లు...

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP SP) అధినేత శరద్ పవార్ (85) గొంతు సమస్యలు, తీవ్రమైన దగ్గు కారణంగా ఈరోజు (9 ఫిబ్రవరి) సాయంత్రం పూణేలోని హాస్పిటల్లో చేరారు. అయితే శరద్  పవార్  హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని, అయితే శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉందని, గత 10-12 రోజులుగా వరుస ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ వల్ల ఆయన తీవ్రమైన అలసటకు గురయ్యారు. దీనివల్ల ఛాతీలో కొంచెం ఇన్ఫెక్షన్  ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు.  ప్రస్తుతం ఆయనకు ప్రాథమిక చికిత్స చేయగా.. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 

శరద్ పవార్ ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలో రిపోర్ట్స్ అన్ని వచ్చాకే  నిర్ణయం తీసుకుంటాము. శరద్ పవార్ పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆందోళన చెందడానికి ఎం లేదు అని కుటుంబీకులు చెప్పారు.ఆసుపత్రి వద్ద పార్టీ కార్యకర్తలు ఎవరూ రావొద్దని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కోరారు.