మున్సిపల్ ఎన్నికల వేళ చెన్నూరులో BRS పార్టీకి బిగ్ షాక్

మున్సిపల్ ఎన్నికల వేళ చెన్నూరులో BRS పార్టీకి బిగ్ షాక్

మంచిర్యాల జిల్లా: మున్సిపల్ ఎన్నికల వేళ చెన్నూరులో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భీమారం మండలానికి చెందిన చెరుకు సరోత్తం రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. సరోత్తం రెడ్డికి మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలోనీ 2,14,6,17 వార్డులలో కార్నర్ మీటింగ్ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలో రూ.50 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

చెన్నూరు మున్సిపాలిటీలో 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే పనులు చేసిందని మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఒక్క రూపాయి నిధులు లేకుండా చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ రైతులకు 28 కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వడానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. చెన్నూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి