Spirit: వాట్సాప్ ఫ్యాక్టరీలో కథల అల్లడం మాని.. వెళ్లి మీ పని చూసుకోండి.. ప్రకాష్ రాజ్ ఫైర్

Spirit: వాట్సాప్ ఫ్యాక్టరీలో కథల అల్లడం మాని.. వెళ్లి మీ పని చూసుకోండి.. ప్రకాష్ రాజ్ ఫైర్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమా అప్డేట్ తోనే సినీ వర్గాల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ క్రమంలో మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ బీభత్సం సృష్టించాయి. ఈ సినిమా స్టోరీ లైన్, క్యాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా ప్రతిదీ అభిమానుల్లో ఆసక్తి పెంచేలా చేశాయి. ఈ క్రమంలోనే కొన్ని గాసిప్స్ సినిమా విభాగంపై పడుతుండటంతో సినీ ఫ్యాన్స్ని పూర్తిగా డిస్సపాయింట్ చేస్తున్నాయి.  

లేటెస్ట్గా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్, ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లుగా వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఓక కీలక సన్నివేశానికి సంబంధించి ప్రకాష్ రాజ్, డైరెక్టర్ సందీప్ వంగా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లుగా వినిపిస్తూ సినీ వర్గాల్లో అలజడి క్రియేట్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్.. JustAsking పేరుతో, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. "స్పిరిట్ సినిమాలో నా సన్నివేశాల చిత్రీకరణను మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడే మీ వాట్సాప్ ఫ్యాక్టరీలు కథలను అల్లి ప్రచారం చేస్తున్నాయి. కొంచెం పెద్దవాళ్లలా ప్రవర్తించండి, వెళ్లి మీ పని చూసుకోండి. #JustAsking’’ అంటూ ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ ఒక్క ట్వీట్తో నెటిజన్ల నోళ్లన్నీ మూతపడేలా చేసారు ప్రకాష్ రాజ్.

ALSO READ : ప్రభాస్ 'స్పిరిట్' నుండి ప్రకాష్ రాజ్ అవుట్? సందీప్ రెడ్డి వంగాతో విభేదాలే కారణమా?

ఇకపోతే, ప్రభాస్ 46వ బర్త్ డే స్పెషల్గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ నుండి 'సౌండ్ స్టోరీ'ని షేర్ చేసుకున్నారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే క్లారిటీ ఇచ్చాడు.  గ్లింప్స్ ప్రారంభంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లే సన్నివేశాల్ని ఆడియో ద్వారా వినిపించారు. అక్కడ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “వీడి గురించి విన్నాను, యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు... చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో. వీణ్ణి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్‌కి పంపించండి” అంటూ చెప్పే డైలాగ్స్ సందీప్ మార్క్ రైటింగ్‌ను గుర్తు చేశాయి.

చివర్లో ప్రభాస్ చెప్పే “మిస్టర్ సూపరింటెండెంట్... నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది” అనే డైలాగ్ గ్లింప్స్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆ ఒక్క లైన్‌తోనే ప్రభాస్ పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఇందులో ప్రభాస్తో పాటుగా త్రిప్తి దిమ్రీ, కాంచన, ప్రకాష్ రాజ్ మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.