రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపితమై 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలోనినెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండూ రోజుల కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయాలకు అతీతంగా ఉండే సినీ ప్రముఖులు ఈసారి భారీ సంఖ్యలో తరలిరావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాణ్ ఖాన్ హాజరవడం నెట్టింట వైరల్ గా మారింది.
శతాబ్ది ఉత్సవాల్లో మెరిసిన బాలీవుడ్ తారలు
ముంబై వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్100 ఏళ్లు ఉత్సవాల్లో బాలీవుడ్ దిగ్గజాలు సందడి చేశారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, రవీనా టాండన్, అనన్యా పాండే, శిల్పా శెట్టి వంటి ప్రముఖులు హాజరైయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. సినీ గ్లామర్, ఆధ్యాత్మికత , దేశభక్తి మేళవించిన ఈ సభ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీల ప్రశంసల జల్లు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు మోహన్ భగవత్ మాటలకు మంత్రముగ్ధులయ్యారు. మొదటిసారి మోహన్ భగవత్ ప్రసంగం ప్రత్యక్షంగా వినే అవకాశం కలిగిందని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ అన్నారు.. ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి అని ప్రశంసించారు.ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏళ్ల ప్రయాణం అద్భుతం. భాగవత్ గారి ఉపన్యాసం కేవలం స్ఫూర్తిదాయకంగా మాత్రమే కాదు, ఆయనలోని చమత్కారం కూడా నన్ను ఆకట్టుకుంది అని తన అభిప్రాయాన్ని కరణ్ జోహార్ పంచుకున్నారు. నేను మోహన్ భగవత్ కి పెద్ద అభిమానిని. ఆయన మాటలు నాకు ఎన్నో విషయాలను నేర్పించాయి అని శిల్పా శెట్టి పేర్కొన్నారు.
SHILPA SHETTY : "I am a big fan of Mohan Bhagwat. Congratulations to RSS on its centenary" pic.twitter.com/GHI0hC4UfS
— News Algebra (@NewsAlgebraIND) February 8, 2026
సల్మాన్ ఖాన్ - యువతకు స్ఫూర్తి
నేటి కాలేజీ విద్యార్థులపై సెలబ్రిటీల ప్రభావం ఎంతలా ఉంటుందో మోహన్ భాగవత్ వివరించారు. ఈ క్రమంలో ఆయన సల్మాన్ ఖాన్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ గారు ఏం ధరిస్తే, కాలేజీ విద్యార్థులు దాన్నే ఫాలో అవుతారు. ఎందుకు వేసుకుంటున్నారో వారికి తెలియదు, కానీ ఆయన వేసుకున్నారు కాబట్టి మేము కూడా వేసుకుంటున్నాం అంటారు. సమాజంలో ఫ్యాషన్‌ను సృష్టించే వ్యక్తులు అత్యంత నమ్మకస్తులైన, గొప్ప కీర్తి కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు అని భగవత్ పేర్కొన్నారు. ఈ మాటలు విన్న సల్మాన్ ఖాన్ చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.
LATEST: RSS chief Mohan Bhagwat about Salman Khan!
— Being ADARSH⚡ (@IBeingAdarsh_) February 8, 2026
"College students copy Salman Khan ji fashion. When asked why, they say they don’t know. Salman is doing it. Aise logo ki samajh me bahut izzat hoti hai" #SalmanKhan #BattleOfGalwan pic.twitter.com/JobqXfltf0
మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
ఈ వేదికపై మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే, ఆ అవార్డు గౌరవం మరింత పెరుగుతుంది అని ఆయన చేసిన వ్యాఖ్యకు సభికుల నుండి భారీ మద్దతు లభించింది. అంతేకాకుండా, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగ పోటీపై మాట్లాడుతూ.. హిందూ సమాజం తక్కువ నైపుణ్యం కలిగిన పనులను వదిలివేయడం వల్ల, ఆ ఖాళీలను చొరబాటుదారులు భర్తీ చేస్తున్నారని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. హిందూ అస్తిత్వం, పౌర బాధ్యతపై ఆయన ఇచ్చిన సందేశం చర్చకు దారితీసింది.
►ALSO READ | Samantha: పికిల్ బాల్ కోర్టులో సామ్-రాజ్ సందడి.. భార్య ఉత్సాహానికి ఫిదా అయిపోయిన భర్త!
నెటిజన్ల రియాక్షన్
ప్రముఖ నటులు ఆర్‌ఎస్‌ఎస్ వేదికపై కనిపించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వంటి వారు ఈ స్టార్లను "పిరికివారు" అంటూ విమర్శించగా, మరికొందరు మాత్రం భారతీయ సంస్కృతిని గౌరవించడంలో తప్పులేదని మద్దతు పలుకుతున్నారు.మొత్తానికి, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు కేవలం ఒక సంస్థ వేడుకగా కాకుండా, సినీ , సామాజిక వర్గాలను ఏకం చేసిన వేదికగా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#WATCH | Mumbai, Maharashtra: Actor Salman Khan leaves after attending a program of RSS celebrating its 100 years. pic.twitter.com/qkdDMlzI8C
— ANI (@ANI) February 7, 2026
