టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత తన కెరీర్ విషయంలో ఏ మాత్రం తగ్గడంలేదు. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం 'మా ఇండి బంగారం' మూవీలో నటిస్తోంది. గతంలో 'ఓ బేబీ' వంటి క్లాసిక్ హిట్ అందించిన తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సామ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీని సామ్ స్వయంగా స్థాపించిన 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ' బ్యానర్ పై తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి దీనిని నిర్మిస్తోంది.
పికిల్ బాల్ లీగ్‌లో సందడి
ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. సినీ రంగంలోనే కాదు క్రీడారంగంలోనూ పెట్టుబడులు పెట్టి ముందుకుసాగుతోంది. లేటెస్ట్ పికల్ బాల్ లీగ్ లో సామ్ రాజ్ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన టీమ్ టీమ్ చెన్నై సూపర్ ఛాంప్స్ విజయం సాధించడంతో సామ్ ఎగిరి గంతేస్తూ, కేకలు వేస్తూ సందడి చేసింది. భర్త రాజ్ నిడిమోరు పక్కనే ఉండగా, సామ్ చేసిన సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెలోని ఆ పాత ఉత్సాహాన్ని, చిరునవ్వును చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సామ్ పికల్ బాల్ టీమ్ కు అభినందనలతో నెటిజన్లు ముంచెత్తుతున్నారు.
►ALSO READ | Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదలపై బిగ్ అప్డేట్.. సెన్సార్‌లో కీలక పరిణామం!
సమంత గతేడాది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరునుతో ఏడడుగులు వేసింది. వీరి ప్రయాణం వృత్తిపరంగా మొదలై గాఢమైన ప్రేమగా మారి చివరికి పెళ్లిపీటల వరకు దారితీసింది. డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక నిలయం ఇషా ఫౌండేషన్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా, అంతే ప్రశాంతంగా జరిగింది. సద్గురు సమక్షంలో 'భూత శుద్ధి' పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆర్భాటాలకు దూరంగా, ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వివాహం అప్పట్లో నెట్టింట పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను, వృత్తిపరమైన సినీ రంగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది సమంత.
#TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew
— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026
