Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదలపై బిగ్ అప్డేట్.. సెన్సార్‌లో కీలక పరిణామం!

Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదలపై బిగ్ అప్డేట్.. సెన్సార్‌లో కీలక పరిణామం!

దళపతి విజయ్ నటించిన “జన నాయగన్” విడుదలపై  కీలకమైన అప్డేట్ వచ్చింది.సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు చుట్టుముట్టడంతో విడుదలపై సందిగ్ధత కొనసాగుతోండగా.. సానుకూల పరిణామం చోటుచేసుకుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర నిర్మాతలు సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు వేగవంతం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కట్స్, మార్పులకు చిత్రబృందం అంగీకరించినట్లు తెలుస్తోంది. అవసరమైన ఎడిట్స్ పూర్తి చేసి, ఫైనల్ కట్ వెర్షన్‌ను మరోసారి సెన్సార్ రివ్యూ కమిటీకి పంపినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో, రివ్యూ కమిటీ ఈ సినిమాకు అనుమతి ఇస్తే, త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం నిర్మాతలు, ఫిబ్రవరి 20న సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

సెన్సార్ వివాదం ‘జన నాయగన్’పై మతపరమైన భావోద్వేగాలు, సాయుధ దళాల ప్రతిష్టకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో CBFC ముందుగా సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలిపివేసింది. ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్పటికీ తుది నిర్ణయం సెన్సార్ రివ్యూ కమిటీకే అప్పగించబడింది.

విడుదల ఆలస్యం: ఇదిలా ఉండగా, ‘జన నాయగన్’ విజయ్‌కు నటుడిగా చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల ఆలస్యం కావడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు విజయ్‌కు మద్దతుగా నిలవడం విశేషం. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.