కామారెడ్డి జిల్లాలో NH-44పై కంటైనర్ దగ్ధం

కామారెడ్డి జిల్లాలో NH-44పై కంటైనర్ దగ్ధం

సదాశివనగర్: కామారెడ్డి జిల్లాలో NH-44పై కంటైనర్ దగ్ధమైంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్తో కంటైనర్ దగ్ధమైంది. 

కొరియర్ కంపెనీకి చెందిన కంటైనర్గా పోలీసులు గుర్తించారు. కంటైనర్లో ఉన్న ఉత్తరాలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.