భూపాలపల్లి: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉదయం 08:30 నుంచి 10:00 వరకు గంటన్నరలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్లను తాకుతూ, 8 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద ప్రవాహం వస్తుండటం గమనార్హం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 1,01,530 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. పందిపంపుల, మసి వాగు భయానకంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులో భీముని పాదం పరవాళ్ళు తొక్కుతుంది. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కోరుట్ల నియోజకవర్గంలోని నీరు నిలిచి ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి.
చెరువులు నిండుకుండలా మారాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నీరాల దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. మహా రాష్ట్ర , తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
* ఇన్ ఫ్లో: 90,000, క్యూసెక్కులు
* అవుట్ ఫ్లో: 81,700 క్యూసెక్కులు
* ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
* ప్రస్తుత నీటిమట్టం..317.12 మీటర్లు.
* ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
* ప్రస్తుత నీటి సామర్థ్యం 6.95 టీఎంసీలు.
* ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి
తెలంగాణలో వర్షపాతం వివరాలు:
* మంచిర్యాల జిల్లా – కాసిపేట్ మండలం – కొండాపూర్: 15 cm
* జగిత్యాల జిల్లా – ఎండపల్లి మండలం – గుల్లకోట: 5 cm
* మంచిర్యాల జిల్లా – జన్నారం మండలం – తపాల్పూర్: 3. 8 cm
* జగిత్యాల జిల్లా – వెల్గటూర్ 3.7 cm
* పెద్దపల్లి జిల్లా – ధర్మారం: 3.6cm
* జగిత్యాల జిల్లా – మల్లియాల్: 3.5.cm
* జగిత్యాల జిల్లా – ఎండపల్లి 3.5 cm
* కుమురం భీమ్ జిల్లా – తిర్యాని మండలం – గిండెరాయి: 2.9 cm
* జగిత్యాల జిల్లా – మెట్‌పల్లి 2.9cm
* కుమురం భీమ్ జిల్లా – కెరమెరి 2.8cm
