ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు సీఎం తక్షణమే రాష్ట్ర విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు. వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాలేజీలను, విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ.. మరోవైపు ఉద్యోగ దరఖాస్తులు కూడా నింపడం రాదని హేళన చేయడం సరికాదన్నారు.

సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభల్లో పాల్గొనేందుకు రాంచందర్ రావు అమెరికా చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఆటా ప్రతినిధులు, బీజేపీ ఎన్ఆర్ఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.