ఆధ్యాత్మికం: పూజ చేసిన పూలను ఏంచేయాలి.. ఈ పొరపాట్లు చేశారా కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

ఆధ్యాత్మికం:  పూజ చేసిన పూలను ఏంచేయాలి.. ఈ పొరపాట్లు చేశారా కష్టాలు  కొని తెచ్చుకున్నట్లే..!

హిందువులు చాలా మంది పూజలు చేస్తారు.  రోజు ఉదయాన్నే పూలతో భగవంతుడిని అర్చన చేస్తారు.  మరుసటి రోజు మళ్లీ పూజ చేసేటప్పుడు ఆ పూలను తీసేస్తారు.  ఆ పూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు.  మరి ఆ పూలను ఏంచేయాలి.. ఎక్కడ పడేయాలి .. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

సనాతన ధర్మంలో పూజ చేసేటప్పుడు దేవతారాధనలో పూలకు చాలా ప్రాధాన్యత ఉంది.  భగవంతునికి సమర్పించే పూలను నిర్మాల్యం అంటారు. ఇవి దైవ శక్తిని కలిగి ఉంటాచి.  చాలా మంది తెలిసీ తెలియన నిర్మాల్యం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.  ఇవి దైవ శక్తిని, సత్త్వ గుణాన్ని శోషించుకుంటాయి.  నిర్మాల్యాన్ని సరైన రీతిలో వదిలించుకోవడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. 

హిందూ సంప్రదాయంలో దేవునికి సమర్పించిన పూజ పూలు అత్యంత పవిత్రమైనవి.  పూజ పూర్తయిన తర్వాత ఆ ఎండిపోయిన లేదా పాత పూల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.  పూజ పువ్వులను చెత్తకుండీలో వేయడం, కాలిబాటలపై పడేయడం లేదా కాళ్ళ కింద తొక్కడం  వలన చాలా ఇబ్బందులు వస్తాయి.   దైవిక శక్తిని కలిగి ఉండే ఈ పువ్వులను గౌరవప్రదంగా ఉపయోగించాలి.  మొక్కలకు ఎరువుగా మార్చి నిర్మాల్యాన్ని సరిగ్గా ఉపయోగించడం  వల్ల ఇంట్లో సకల శుభాలు, శాంతి చేకూరుతాయి.

  • పూజించిన పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ చెత్తతో కలిపి డస్ట్‌బిన్‌లో వేయకూడదు. ఇది దేవుడిని అవమానించడమే అవుతుంది. 
  • పాత పువ్వులను రోడ్డుపై లేదా నడిచే దారిలో పడేయకూడదు. ఇతరుల కాళ్ళు వాటిపై పడితే తీవ్రమైన వాస్తు దోషం, పాపం చుట్టుకుంటాయి.
  •  వాడిపోయిన లేదా ఎండిపోయిన పువ్వులను పూజా మందిరంలో రోజుల తరబడి ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

పూజ పువ్వులను ఎలా ఉపయోగించాలి

ప్రకృతి సిద్ధమైన ఎరువు: పూజ చేసిన  ఇంట్లోని మొక్కల కుండీలలో లేదా తోటలో వేయడం. కాలక్రమేణా ఇవి ఎండిపోయి మంచి సహజమైన ఎరువుగా మారతాయి. దీనివల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి, పవిత్రత కూడా కాపాడబడుతుంది.

పవిత్ర జలాల్లో నిమజ్జనం:  సమీపంలోని నది, చెరువు లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతర వ్యర్థాలను నీటిలో వేయకుండా జాగ్రత్తపడాలి.

►ALSO READ | Vastu Tips:రాత్రిపూట ఈ పనులు చేస్తున్నారేమోచెక్ చేసుకోండి..లక్ష్మీదేవి కోపంతో దూరమవుతుంది.. !

పవిత్ర ధూపం తయారు చేయడం: ఎండిపోయిన  పూల రేకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా సాంబ్రాణి, నెయ్యి, కర్పూరం కలిపి ఇంట్లో ధూపంలా వేసుకోవచ్చు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమికొట్టి మంచి సువాసనను ఇస్తుంది.

నీటిలో కలిపి చెట్లకు పోయడం: నదులు అందుబాటులో లేనివారు ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో ఈ పూలను కొన్ని గంటలు నానబెట్టి, ఆ నీటిని, పూలను ఇంట్లోని తులసి చెట్టు తప్ప ఇతర పవిత్రమైన చెట్లు అయిన  రావి లేదా మర్రి చెట్టు వంటి వాటికి మొదట్లో పోయవచ్చు. దేవునికి సమర్పించే ప్రతి వస్తువులోనూ భగవంతుని అనుగ్రహం ఉంటుంది.  నిర్మాల్యాన్ని పవిత్రంగా, బాధ్యతాయుతంగా నిర్వహించడం ద్వారా మనం దైవ కృపకు పాత్రులమవుతాము.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.