కష్టపడతారు.. క్షణం తీరిక ఉండదు.. డబ్బు బాగానే సంపాదిస్తారు. అయినా సరే రూపాయి కావాలంటే ఎతుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది. వాస్తు పండితులు సంప్రదిస్తారు.. జ్యోతిష్య సిద్దాంతులు చెప్పిన రెమిడీస్ చేస్తారు.. ఎన్నో పూజలు పునస్కరాలు చేస్తారు. అయినా నో ఛేంజ్.. అయితే వాస్తు పండితులు తెలిపిన వివరాలు ప్రకారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి దూరమవుతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఎలాంటి పనులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
రోజంతా కష్టపడతారు.. కాని ప్రశాంతమైన నిద్రపోరు. ఒకటే ఆలోచనలు.. ఆర్థిక సమస్యలు .. ఆరోగ్య సమస్యలు.. ఇతర సమస్యలు ఇలా ఆలోచిస్తూ రాత్రంతా గడుతుపుతారు. ఇంటి వాతావరణం సరిగా లేకపోతే ఎప్పుడు ఏదో ఒక సమస్య వేధిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట కొన్ని పనులు చేసినా.. కొన్ని వస్తువులు చూసినా ఇంట్లోకి ప్రతికూలశక్తి పెరిగి అశాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. గందరగోళ పరిస్థితులమధ్య లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంటి నుంచి దూరమవుతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను చూడటం లేదా కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి. తద్వారా మానసిక అశాంతి, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.
సింక్ లో గిన్నెలు: చాలామంది రాత్రి సమయంలో భోజనం తరువాత పాత్రలను శుభ్రం చేయకుండా.. అలానే వదిలేస్తారు. పొద్దున్నే పని మనిషి వచ్చి శుభ్రం చేస్తుందని కొందరు.. మరి కొందరు అలసిపోయి.. తరువాత రోజు ఉదయం కడుక్కోవచ్చులే అని సింక్ లో వదిలేస్తారు. సింక్లో పాత్రలు ఉండటం వాస్తు ప్రకారం అసలు మంచిది కాదు. వాడిన గిన్నెలు శుభ్రం చేయకుండా ఇంట్లో ఉండటం వలన రాహు.. కేతువుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా సింక్లో ఉండే మురికి పాత్రలు ఇంట్లోకి నెగిటివ్ శక్తిని ఆకర్షించడంవలన లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళిపోతుంది. దీని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని వలన అశాంతి..మనశ్శాంతి లోపించడం వంటివి కలుగుతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.
రాత్రిపూట అద్దంలో చూడటం : చాలామంది బెడ్ రూంలో డ్రస్సింగ్ టేబుల్ పెట్టుకుంటారు. దానికి కచ్చితంగా అద్దం ఉంటుంది. డ్రస్సింగ్ టేబుల్ లేకపోయినా చిన్న అద్దాన్నైనా ఉంచుకుంటారు. రాత్రి పడుకునే ముందు అద్దంలో ముఖం చూసుకోవడం ... మంచానికి ఎదురుగా అద్దం ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పొద్దన్నే లేవగానే ఎట్టి పరిస్థితిలో అద్దం చూడకూడదు. ఇలా చేయడం వలన రాత్రివేళల్లో చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆసమయంలో అద్దంలో చూసుకుంటే అనవసరమైన భయాలు, మానసిక ఒత్తిడి పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. పడకగదిలో అద్దం ఉంటే రాత్రి నిద్రపోయే సమయంలో దానిపై ఒక గుడ్డను కప్పి ఉంచడం శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
దిండు పక్కన.. మంచానికి దగ్గరలో నీటి సీసా : రాత్రిపూట నీళ్లు తాగేందుకు చాలామంది దిండు పక్కనగాని.. మంచానికి దగ్గర కాని వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం మంచానికి దగ్గరలో అస్సలు వాటర్ బాటిల్ ఉండకూడదు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం నీరు చంచల స్వభావానికి ప్రతీక అని చెబుతారు. నీటికి చంద్రుడికి దగ్గరి సంబంధం ఉంది. రాత్రిపూట చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఆలోచనలు.. మనస్సు నిలకడ విషయంలో కీలకపాత్ర పోషిస్తాడు. దిండుకు దగ్గరలో వాటర్ బాటిల్ కాని.. నీళ్ల చెంబు కాని ఉంటే మనస్సు నిలకలడగా ఉండదు. ఆలోచనలు ఎక్కువై.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. నీళ్లు తాగాలనుకుంటే మంచానికి కొద్దిగా దూరంలో ఉన్న బల్లపై ఉంచుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
బాత్రూం బకెట్ ఖాళీగా ఉండటం: చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌లో బకెట్ అలాగే ఖాళీగా వదిలేస్తారు. అందులో నీళ్లు ఉంటే పారబోసి అలాగే వదిలేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి బాత్రూంలో బకెట్ ఎప్పుడు నింపి పెట్టాలి. అదనంగా అది ఇంటి బకెట్ పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తడిబట్టలు: ఇంటి బాత్రూంలో ఎప్పుడూ తడి బట్టలు వదిలేయకూడదు. ఇది కూడా వాస్తు దోషానికి దారి తీస్తుంది. అంతేకాదు ఆ ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బాత్రూంలో అలా తడి బట్టలు వదిలేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
