ఈ రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుక్కుంటే సంబరం కాదు. ఆ క్లెయిమ్స్ ఎవరు వేగంగా క్లియర్ చేస్తున్నారు. ఎంత వరకూ అమౌంట్ సేటిల్ చేస్తున్నారు. ఎన్నాళ్లు తిప్పించుకుంటున్నారు. ఎన్నాళ్లు వెయిటింగ్ లిస్టులో పెడుతున్నారు. ఏఏ కారణాలతో ఏ కంపెనీలు క్లెయిమ్ రిజెక్ట్ చేసి తప్పించుకుంటున్నాయి ఇలా వంద అంశాలను పరిశీలించాకే ఒక కంపెనీ నుంచి పాలసీ కొనాల్సిన రోజులివి. గుడ్డిగా ఎవరో చెప్పారని.. తెలిసిన ఏజెంట్ అడిగాడని పాలసీలు కొన్నారో ఆ తర్వాత క్లెయిమ్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయాయి. అందుకే అసలు ఏ సంస్థలు తమ పాలసీహోల్డర్లకు లాయల్టీగా సేవలు అందిస్తున్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో టాప్ కంపెనీలు ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మనం ప్రధానంగా గమనించాల్సింది క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తన వద్దకు వచ్చిన క్లెయిమ్‌లలో ఎన్నింటిని విజయవంతంగా పరిష్కరించిందో తెలిపే లెక్క. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం క్లెయిమ్‌ల పరిష్కారంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. మొత్తం పరిశ్రమ సగటున 97.10% డెత్ క్లెయిమ్‌లను కేవలం 30 రోజుల్లోపు పరిష్కరించడం విశేషం.
►ALSO READ | రూ.7 లక్షల లోపు మంచి SUV కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ కార్ల పై ఓ లుక్కేయండి..
ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంలో మరింత వేగంగా స్పందిస్తూ 97.30% సెటిల్‌మెంట్ రేషియోను నమోదు చేశాయి. అయితే కేవలం ఎన్ని పాలసీలకు డబ్బులు చెల్లించారనేదే కాకుండా, ఎంత మొత్తాన్ని క్లెయిమ్ చేశారో కూడా చూడటం ముఖ్యం. కొన్ని కంపెనీలు చిన్న క్లెయిమ్‌లను త్వరగా ఇచ్చి.. పెద్ద మొత్తంలో ఉండే క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెడుతుంటాయి. కానీ తాజా గణాంకాల ప్రకారం అగ్రగామి సంస్థలు రెండింటిలోనూ 100% స్కోరుతో దూసుకుపోతున్నాయి.
పాలసీల సంఖ్య ఆధారంగా టాప్ క్లెయిమ్ సెటిల్‌మెంట్:
1. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్: 100% క్లెయిమ్‌లను 30 రోజుల్లోపే పరిష్కరించి అగ్రస్థానంలో నిలిచింది.
2. ఆదిత్య బిర్లా సన్ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్ సంస్థలు 99.98% సెటిల్మెంట్ రేషియోతో 2వ స్థానంలో నిలిచాయి.
3. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: 99.14% క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించింది.
4. టాటా ఏఐఏ లైఫ్: 98.66% రేషియోను నమోదు చేసింది క్లెయిమ్ సెటిల్మెంట్లలో.
5. ఎల్ఐసీ: 97.08% సెటిల్‌మెంట్ రేషియోను కలిగి ఉంది. అయితే సెటిల్మెంట్ల సంఖ్య పరంగా ఎల్ఐసీ ఏకంగా 8.48 లక్షల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
క్లెయిమ్ చేసిన అమౌంట్ ఆధారంగా టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలు:
క్లెయిమ్ చేసిన మొత్తం సొమ్మును చెల్లించడంలో కూడా శ్రీరామ్ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, పీఎన్‌బీ మెట్‌లైఫ్ సంస్థలు 100% మార్కును సాధించాయి. దీని అర్థం ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉండే క్లెయిమ్‌లను కూడా ఎటువంటి ఆలస్యాలు లేకుండా చెల్లిస్తున్నాయి. స్టార్ యూనియన్ దై-ఇచి లైఫ్ 98.20%, ఎస్‌బీఐ లైఫ్ 98.00% క్లెయిమ్స్ మొత్తాన్ని 30 రోజుల్లోపు సెటిల్ చేశాయి.
►ALSO READ | తమిళనాడులో టాటా JLR: రాణిపేట్ ప్లాంట్ నుంచి ఫస్ట్ 'రేంజ్ రోవర్' బయటకు..
భారత ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గత కొన్నేళ్లుగా టెక్నాలజీని వాడుకుంటూ క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఒకప్పుడు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి ఆగాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు 30 రోజుల్లోపే 97% పైగా క్లెయిమ్‌లు పరిష్కారం కావడం పాలసీదారుల్లో భరోసాను నింపుతోంది. కొత్తగా పాలసీ తీసుకోవాలనుకునే వారు కంపెనీల ఆర్థిక బలం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ లెక్కలను పరిగణలోకి తీసుకుని తమకు అనుకూలమైన పాలసీలను ఆయా సంస్థల నుంచి కొనుగోలు చేయటం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అన్నీ తెలుసుకున్నాకే పాలసీ కొనంది కంగారు లేకుండా.
