రూ.7 లక్షల లోపు మంచి SUV కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ కార్ల పై ఓ లుక్కేయండి..

 రూ.7 లక్షల లోపు మంచి SUV కొనాలనుకుంటున్నారా..  అయితే ఈ కార్ల పై ఓ లుక్కేయండి..

తక్కువ ధరలో మంచి కంఫర్ట్, బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనడం ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే మారింది. అదికూడా మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో  ఎక్కువ స్థలం ఉండే SUV కావాలని ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ రూ.7 లక్షలలోపు ఉండి, ఏ కారు తీసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తుంటే.. మీకు ప్రస్తుతం మార్కెట్లో రెండు బెస్ట్ ఫీచర్స్ ఉన్న టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కార్ల గురించి మీకోసం...

ఈ రెండింటి బేస్ వేరియంట్ల మధ్య తేడాలు చూస్తే..

*టాటా పంచ్ (Smart Variant)లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, LED హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ మీటర్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ (TPMS), సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.*

*హ్యుందాయ్ ఎక్స్‌టర్ (EX Variant)లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, డిజిటల్ మీటర్, పవర్ స్టీరింగ్, ESC, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, అన్‌లాక్, కీలెస్ ఎంట్రీ  ఉన్నాయి. ఎక్స్‌టర్ కంటే కొత్త Smart Variant పంచ్‌లో కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఎక్కువగా కనిపిస్తాయి.

►ALSO READ | ఒక్క రాంగ్ మెసేజ్ జీవితాన్నే తలకిందులు చేసింది.. రూ.70 లక్షలు కోల్పోయిన బెంగళూరీ

ఇంజిన్ అండ్ మైలేజ్ 
ఈ రెండు కార్లలోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పంచ్  పవర్ 85.4 hp, ఎక్స్‌టర్ పవర్ 82 hp. ఈ రెండు కార్లు కూడా లీటరుకు సుమారు 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇంకా సిటీ డ్రైవింగ్‌కు చాలా బాగుంటుంది. అలాగే రెండిటికి మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్  ఇచ్చారు. 

సేఫ్టీ
సేఫ్టీ విషయంలో టాటా పంచ్ ముందుంది. దీనికి భారత్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్ వచ్చింది. అదే హ్యుందాయ్ ఎక్స్‌టర్ లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 26 రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నా  దీనికి ఇంకా క్రాష్ టెస్ట్ రేటింగ్ రాలేదు.

ధర
టాటా పంచ్ Smart Variant ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.59 లక్షలు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.64 లక్షలు. మీకు సేఫ్టీ, కొత్త డిజైన్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే టాటా పంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు హ్యుందాయ్ బ్రాండ్ మీద నమ్మకం ఉంటే, సిటీలో స్మూత్ డ్రైవింగ్ కావాలంటే హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఆప్షన్.