సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో BCCI కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు భారత క్రికెటర్ల ప్రదర్శన బట్టి కేటగిరీలకు ఎంపిక చేసింది. ఈ కాంట్రాక్ట్లో కోహ్లీ, రోహిత్ గ్రేడ్ B కేటగిరికి పడిపోయింది. కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు. రోహిత్, విరాట్ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వీరికి డిమోషన్ తప్పలేదు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా టీమ్ ఇండియా వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఈ కాంట్రాక్టులు ఆటగాళ్ల ప్రదర్శన, అనుభవం, జట్టు అవసరాలు, నిరంతరత ఆధారంగా గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ Cగా విభజించారు. ఏఏ కేటగిరిలో ఎవరున్నారో.. ఏ కేటగిరీలో ఉంటే ఎంత చెల్లిస్తారో ఓ లుక్కేయండి..
గ్రేడ్ A ఆటగాళ్లు
శుభ్‌మన్ గిల్
జస్ప్రీత్ బుమ్రా
రవీంద్ర జడేజా
గ్రేడ్ B ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
వాషింగ్టన్ సుందర్
కేఎల్ రాహుల్
మహ్మద్ సిరాజ్
హార్దిక్ పాండ్యా
రిషబ్ పంత్
కుల్దీప్ యాదవ్
యశస్వీ జైస్వాల్
సూర్యకుమార్ యాదవ్
శ్రేయాస్ అయ్యర్
గ్రేడ్ C ఆటగాళ్లు
అక్షర్ పటేల్
రుతురాజ్ గైక్వాడ్
తిలక్ వర్మ
రింకూ సింగ్
శివమ్ దూబే
సంజూ శాంసన్
అర్ష్‌దీప్ సింగ్
ప్రసిద్ధ్ కృష్ణ
ఆకాశ్ దీప్
ధృవ్ జురెల్
హర్షిత్ రాణా
వరుణ్ చక్రవర్తి
నితీశ్ రెడ్డి
అభిషేక్ శర్మ
సాయి సుదర్శన్
రవి బిష్ణోయ్
BCCI ఆటగాళ్ల కాంట్రాక్టులు ప్రతి సీజన్‌కు సంవత్సరానికి ఒకసారి జారీ చేస్తుంది.
గత సీజన్ల (సుమారు 2025–26) ప్రకారం:
- Grade A ₹5 కోట్లు
- Grade B ₹3 కోట్లు
- Grade C ₹1 కోటి
గతంలో గ్రేడ్ A+ కేటగిరీ ఉండేది. ఈ కేటగిరీలో ఉన్న క్రికెటర్లు అత్యధికంగా అందుకునేవారు. ఇప్పుడు ఈ ఏ ప్లస్ కేటగిరీని BCCI పూర్తిగా రద్దు చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలైట్ గ్రేడ్ A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
BCCI announces the Annual Player Contracts for Team India Senior Men and Senior Women for the 2025-26 season (October 1st, 2025 to September 30th, 2026).
— ANI (@ANI) February 9, 2026
Grade A - Shubman Gill, Jasprit Bumrah, Ravindra Jadeja, Harmanpreet Kaur, Smriti Mandhana, Jemimah Rodrigues, Deepti Sharma… pic.twitter.com/9sEg0MsPSV
