మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు.. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత..

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు.. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం ( ఫిబ్రవరి 9 ) సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియడంతో మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారంటూ గాంధీ చౌక్ లో ధర్నాకు దిగారు ఎమ్మెల్యే సురేందర్. తమ పార్టీ అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే సురేందర్. ఎమ్మెల్యే మదన్ మోహన్ పిఏలు వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

►ALSO READ | పవన్ కళ్యాణ్ పెద్ద ఈగోయిస్ట్... తెలంగాణలో డిపాజిట్లు రావనే పర్యటన రద్దు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థుల ఇండ్లలో తనిఖీలు చేయడం లేదని అరిపిస్తున్నారు సురేందర్. ప్రచార సమయం ముగిసినప్పటికీ స్థానికేతరులు ఇంకా మునిసిపాలిటీలోనే ఉన్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.