నితిన్ గడ్కరీ బయోపిక్.. ఆయన క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే..

నితిన్ గడ్కరీ బయోపిక్.. ఆయన క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే..

రీసెంట్ డేస్ లో సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ సందడి చేస్తోంది. 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరు తెచ్చుకున్న బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న గడ్కరీ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు మూవీ నుంచి ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ పోస్టర్ లో గడ్కరీ పాత్రలో ఉన్న నటుడు వెనుక్కి చేతులు పెట్టుకున్నట్టుగా ఉంది. కానీ ఇందులో ఈ క్యారెక్టర్ ను పోషిస్తున్న నటుడి గురించి కానీ, అతని ముఖం కానీ మేకర్స్ రహస్యంగా ఉంచారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీవితంలోని టచ్ చేయని కోణాలను ప్రేక్షకులు తెరపై చూడనున్నారు. సినిమాలో గడ్కరీ పోరాటం, జన్‌సంఘ్‌ నుంచి బీజేపీకి ప్రయాణం, సంఘ్‌ వాలంటీర్‌గా ఆయన చేసిన కృషి, రాజకీయ ప్రయాణం వంటి అంశాలను సినిమా ద్వారా చూపించనున్నారు. ఈ సినిమా మరాఠీలో రూపొందుతోంది.

ALSO READ : ఎన్టీఆర్తో ఐరన్ మ్యాన్ లాంటి మూవీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా అనురాగ్ రాజన్ భూసారి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అక్షయ్ దేశ్‌ముఖ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. అభిజిత్ మజుందార్ సమర్పణలో ఈ చిత్రం రానుంది. బాలీవుడ్‌లో బయోపిక్ సంప్రదాయం కొత్తేం కాదు, గత కొన్నేళ్లుగా ఈ సిరీస్‌లో పలువురు రాజకీయ నాయకులపైనా సినిమాలు వచ్చాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేపై బయోపిక్ లు రూపొందాయి.