ఈ కాలం కుర్రోళ్లు మామూలుగా లేరే.. వీళ్లు.. వీళ్ల ఐడియాలు సినిమాలను తలదన్నేలా ఉన్నాయి. కాలేజీ PTM(పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.. కచ్చితంగా పేరంట్స్ రావాలని కాలేజీ ఆర్డర్స్ వేసింది.. మనోడు ఏమో ఆవారాగాడిలా ఉన్నాడు.. ఇక పేరంట్స్ టీచర్స్ మీటింగ్ కు తల్లిదండ్రులు వస్తే.. మనోడి బాగోతం మొత్తం బట్టబయలు అవుతుందని భావించాడు.. అప్పుడే ఓ ఐడియా వేశాడు.. తను ఎప్పుడూ ఉండే ఆన్ లైన్ లో ఓ పోస్ట్ పెట్టాడు.. కాలేజీ PTMలో తల్లిదండ్రులుగా నటించే వాళ్లకు.. 15 వేల రూపాయలు ఇస్తానంటూ ఆఫర్ పోస్ట్ పెట్టాడు.. ఇంకేముందీ.. క్షణాల్లో వైరల్ అయ్యింది. బెంగళూరు సిటీ నుంచి వచ్చిన ఈ ఫన్నీ స్టోరీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నా పేటీఎం (PTM) కోసం నాకు నకిలీ పేరెంట్ అమ్మ లేదా నాన్న కావాలి. నేను కాలేజీ స్టూడెంట్. నకిలీ పేరెంట్ అమ్మ లేదా నాన్న వయసు 40 ఏళ్లు పైబడి ఉండి, ఇంగ్లీష్ గలగలా మాట్లాడగలిగితే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇందుకోసం రూ. 15 వేలు ఇచ్చేందుకు రెడీ. బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వారైతే ఇంకా మంచిది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
►ALSO READ | హోటళ్లు, టీ కొట్టులకు గుడ్ న్యూస్: యూనిట్ కరెంటుపై రూ.2 తగ్గింపు!
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేసారు. కొందరైతే సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకరు మా నాన్న రిటైర్ అయ్యారు, ఖాళీగా ఉంటూ ఏదైనా చిన్న పని కోసం చూస్తున్నారు.. ఇది సెట్ అవుతుందేమో అని సరదాగా కామెంట్ చేయగా... మరొకరు నాకు 34 ఏళ్లే, కానీ గడ్డంలో అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు ఉన్నాయి.. నేను మేనేజ్ చేయగలను ? అని అడిగారు... ఇంకొకరు నాకు 46 ఏళ్లు, కేవలం సరదా కోసం ఈ పని చేస్తాను అంటూ కామెంట్ చేసారు.
ట్విస్ట్‌లు మామూలుగా లేవు:
ఇదే విషయంపై 'X'లో ఒక యూజర్ స్పందిస్తూ 2003లో నా క్లాస్మేట్ ఒకడు ఇలాగే చేశాడు. వంటవాడికి రూ. 10 వేలు ఇచ్చి, సూటు బూటు వేయించి అతని తండ్రిగా కాలేజీకి పంపాడు. ఆ వంటవాడు ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించాడు. సీన్ కట్ చేస్తే.. తరువాత రోజే అతని అసలైన తండ్రి కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌కు 'హలో' చెప్పడంతో అసలు బండారం బయటపడింది! అని చెప్పుకొచ్చాడు.
