హోటళ్లు, టీ కొట్టులకు గుడ్ న్యూస్: యూనిట్ కరెంటుపై రూ.2 తగ్గింపు!

హోటళ్లు, టీ కొట్టులకు గుడ్ న్యూస్: యూనిట్ కరెంటుపై రూ.2 తగ్గింపు!

ఇరాన్ -ఇజ్రాయిల్ మధ్య దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తల కారణంగా వంట గ్యాస్ (LPG) కొరత ఏర్పడటంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్‌కు బదులుగా కరెంటు స్టవ్‌లు వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలకు భారీ రాయితీలు ప్రకటించారు.

 గ్యాస్ సిలిండర్ల కొరత తీరేవరకు, కరెంటు స్టవ్‌లు వాడే హోటళ్లకు యూనిట్‌కు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే గ్యాస్ వాడకం తగ్గించి, ఎలక్ట్రిక్ స్టవ్‌లు కొనుక్కోవాలనుకునే చిన్న వ్యాపారులకు (MSME) ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. ఇందులో కూడా  25 శాతం సబ్సిడీ అందిస్తుంది. మహిళా వ్యాపారులకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా వ్యాపారులు రూ.10 లక్షల వరకు అప్పు తీసుకుంటే, అందులో రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది.

ఎందుకు ఈ నిర్ణయం: 
LPG కొరతతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆసుపత్రులు, స్కూళ్లకు మాత్రమే గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల హోటళ్లకు సిలిండర్లు దొరకడం కష్టమైంది. గ్యాస్ లేక హోటళ్లు మూతపడకుండా ఉండేందుకు వ్యాపారులను కరెంటు స్టవ్‌ల వైపు ప్రోత్సహిస్తున్నారు.

►ALSO READ | కేరళలో గ్యాస్ కష్టాలు: హోటళ్లు, రెస్టారెంట్లు బంద్.. సొంతూళ్లకు వెళ్ళిపోతున్న వలస కార్మికులు..

హోటళ్లు మూతపడితే రైతుల కూరగాయలు అమ్ముడుపోవు. అందుకు రైతులు నేరుగా రైతు బజార్లలో పండించిన పంటలను ఎటువంటి పరిమితులు లేకుండా అమ్ముకునేలా అనుమతి ఇచ్చారు. సామాన్య ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. గ్యాస్ పంపిణీని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.