కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న LPG వంట గ్యాస్ కొరత పెద్ద సమస్యగా మారింది. దింతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో అందులో పనిచేసే వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరకక కేరళలోని చాలా రెస్టారెంట్లు, హోటళ్ల ఇప్పటీకే మూతపడ్డాయి. పని లేకపోవడంతో కార్మికులు/ఉద్యోగులు ఖాళీగా ఉండలేక సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేయాలనే ఉద్దేశంతో... అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన కార్మికులు ఎన్నికలకు ముందే తిరిగి వెళ్లిపోతున్నారు. వచ్చే వారం రంజాన్ పండుగ ఉండటం కూడా వీరు వెళ్లిపోవడానికి ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు.
హోటళ్లలో పనిచేసే వారిలో సగానికి పైగా బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వాళ్లే. వీరంతా ఒకేసారి వెళ్లిపోతే హోటల్ పరిశ్రమ సిబ్బంది కొరతతో కుప్పకూలుతుందని యజమానులు భయపడుతున్నారు.
►ALSO READ | ఇండియాలో వంట గ్యాస్ కొరత నిజమేనా ? పెరిగిన సిలిండర్ రేట్లు, ఇక 45 రోజులు ఆగాల్సిందేనా..!
సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకి పెరగడంతో అస్సాం, బెంగాల్ వెళ్లే రైళ్లలో టిక్కెట్లు దొరకడం లేదు, రైళ్లలో రద్దీ కారణంగా అన్నీ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటున్నాయి. ఒక్కసారి కార్మికులు సొంత ఊళ్లకు వెళ్తే తిరిగి రావడం కష్టం... మళ్లీ ఎన్నికలు ముగిశాక లేదా ఒకటి రెండు నెలల తర్వాతే తిరిగి వస్తారు. అప్పటివరకు ఇక్కడ సిబ్బంది కొరతతో పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది.
గ్యాస్ సమస్య త్వరగా తీరితే కార్మికులను ఆపొచ్చని చూస్తున్నాం. కానీ చిన్న హోటల్ యజమానులు పని లేకపోయినా వారికి జీతాలు ఇచ్చి ఇక్కడ ఉంచుకోవడం కష్టమవుతోంది అని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. కొందరు హోటల్ యజమానులు వలస కార్మికులు లేకపోవడంతో తాత్కాలికంగా స్థానిక మహిళలను పనిలోకి తీసుకుని నెట్టుకొస్తున్నారు.
