మీకు కూడా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు ఉందా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ కారణాలు ఇవే!

మీకు కూడా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు ఉందా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ కారణాలు ఇవే!

కూర్చున్నప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు చాలామందికి తెలియకుండానే కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. ఆఫీసులో సీట్లో కూర్చున్నా, ఇంట్లో సోఫాలో కూర్చున్నా కాళ్లను అలా ఆడిస్తూనే ఉంటారు. ఎవరైనా వద్దని చెబితే కాసేపు ఆపుతారు కానీ, మళ్లీ కాసేపటికి కథ మొదటికి వస్తుంది. అసలు ఇలా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మామూలు అలవాటేనా ? లేక దీని వెనుక ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ? ఈ అలవాటుకు  కారణాలను ప్రముఖ వైద్య నిపుణులు ఎం చెబుతున్నారంటే...

 రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ 
కాళ్లు ఎప్పుడు   ఊపడానికి  అత్యంత ముఖ్యమైన కారణం 'రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్'. ఇది నరాలకు సంబంధించిన ఒక సమస్య. ఈ సమస్య ఉన్నవారికి కాళ్లలో ఏదో పాకుతున్నట్లు, తిమ్మిరిగా లేదా దురదగా అనిపిస్తుంది. ఆ అసౌకర్యం భరించలేక, కాళ్లను కదిలిస్తే కాస్త రిలీఫ్ దొరుకుతుందని పిచ్చిగా ఊపుతుంటారు.  పగటిపూట కంటే రాత్రి నిద్రపోయేటప్పుడు లేదా ఎక్కువసేపు ఒకేచోట కూర్చున్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు.

 విపరీతమైన ఒత్తిడి, ఆందోళన 
మనుషులు తీవ్రమైన టెన్షన్, మానసిక ఒత్తిడి లేదా కంగారులో ఉన్నప్పుడు.. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి శరీరం ఇలాంటి మార్గాలను వెతుక్కుంటుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఒంట్లో 'కార్టిసాల్', 'అడ్రినలిన్' అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. నిశ్శబ్దంగా కూర్చున్నా లోపల ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంటుంది. ఆ టెన్షన్ నుండి బయటపడటానికి చాలామంది  కాళ్లు ఊపడం, గోళ్లు కొరకడం లేదా చేతి వేళ్లను విరవడం చేస్తుంటారు. మనసును ప్రశాంతపరుచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నం ఇది.

►ALSO READ | వేసవిలో కండరాల నొప్పులు వేధిస్తున్నాయా ? నిద్ర పట్టడం లేదా ? ఇలా చెక్ పెట్టండి !

 బోర్ కొట్టడం 
కాళ్లు ఊపడానికి మరో సాధారణ కారణం బోర్ కొట్టడం. ఎక్కడైనా ఎక్కువసేపు వేచి చూడాల్సి వచ్చినప్పుడు, ఆఫీసులో బోర్ కొట్టే మీటింగ్‌లు లేదా కాలేజీలో నచ్చని క్లాసులు వింటున్నప్పుడు తెలియకుండానే కాళ్లు ఊపడం మొదలుపెడతారు. వాళ్ళు ఉన్న పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని అనుకుంటున్నప్పుడు లేదా ఏదైన పని బోర్ కొడుతున్నప్పుడు మనసును డైవర్ట్ చేసుకోవడానికి ఇలా చేస్తుంటారు.

ఎప్పుడు అలర్ట్ అవ్వాలి
బోర్ కొట్టినప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి కాళ్లు ఊపితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ, ఈ అలవాటు అస్సలు ఆగకుండా రోజూ కొనసాగుతూ, దీనివల్ల రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టకపోతే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అది నరాల బలహీనతకు సంకేతం కావచ్చు కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.