భార్యాభర్తల మధ్య రోజురోజుకూ గొడవలు పెరుగుతున్నాయా ? విడిపోయే ముందు ఒక్కసారి ఇది ట్రై చేయండి!

భార్యాభర్తల మధ్య రోజురోజుకూ గొడవలు పెరుగుతున్నాయా ? విడిపోయే ముందు ఒక్కసారి ఇది ట్రై చేయండి!

భార్యాభర్తలు ఇద్దరిమధ్యా ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే.. పరిష్కరించుకోలేని సమస్యలుంటే.. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో తెలియనప్పుడు... ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటే లాభం లేదు. మ్యారేజ్ థెరపీ తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. సమస్యలున్నప్పుడు వైవాహిక బంధాన్ని నిలుపుకోవాలంటే మ్యారేజ్ థెరపీ/మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసుకోవడం బెస్ట్ సొల్యూషన్ అంటున్నారు సైకాలజిస్ట్ లు.

భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం మామూలే. అయితే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ వెళ్తేనే ఆ బంధం నిలబడుతుంది లేదంటే ప్రాబ్లమ్స్ మరింత పెరిగి, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి రావొచ్చు. ఈ పరిస్థితుల్లో మ్యారేజ్ థెరపీ తీసుకోవాలి. జంటల మధ్య సరైన అవగాహన కల్పించి, వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపి.. తిరిగి బంధం బలపడేలా చేసేదే మ్యారేజ్ థెరపీ.

మ్యారేజ్ థెరపీ అంటే
భార్యాభర్తల మధ్య సమస్య ఎంతగా తగ్గకుండా మరింత ముదరిపోతుంటే.. కచ్చితంగా మూడో వ్యక్తి సాయం తీసుకోవాలి. అది సరైన అవగాహన కలిగి, పక్షపాతం లేకుండా వ్యవహరించేగలిగే వాళ్లై ఉండాలి. ఈ పనిచేయగలిగేది ఎక్స్ పర్ట్ అయిన మ్యారేజ్ థెరపీ కౌన్సెలర్స్ మ్యారేజ్ థెరపీ చేసేవాళ్లు ఏ ఒక్కరివైపో నిలబడకుండా ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటారు. దానికి ఇద్దరికీ నచ్చే పరిష్కారం చూపిస్తారు. కపుల్స్ ఇద్దరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేలా చేస్తారు. ఇద్దరిలోనూ మార్చుకోవాల్సిన లోపాలు చెప్పి సరిదిద్దుతారు. ఇద్దరిలో ఉన్న పాజిటివ్ అంశాల్ని గుర్తిస్తారు. ఇద్దరూ కలసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేలా చేస్తారు.

ఎప్పుడు చేయాలి?
చాలా మంది సమస్య వచ్చినప్పుడు అది ఎక్కడుందో గుర్తించలేరు. దీంతో రిలేషన్షిప్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు తప్పు ఒక్కరిదే అయ్యుండొచ్చు. కానీ, ఇద్దరూ ఇబ్బంది పడతారు. తప్పుల్ని గుర్తించలేనప్పుడు లేదా అంగీకరించలేనప్పుడు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మ్యారేజ్ థెరపీ తీసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరీర్, పిల్లల పెంపకం బాధ్యతలు వంటి అంశాల్లో సమస్యలొస్తే కచ్చితంగా మ్యారేజ్ థెరపీ తీసుకోవాలి.

ఏం చేయాలి?
మ్యారేజ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. ముందుగా ఈ కౌన్సెలింగ్ ద్వారా మీరేం కోరుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఉండాలి. ప్రాబ్లమ్  కరెక్ట్ గా వివరించి, దానికి తగ్గ సొల్యూషన్ వెతకాలి. రిటేషన్షిప్ ని ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారు ? లేదా ఎందుకు ముగించాలనుకుంటున్నారు ? విడిపోక తప్పని పరిస్థితి ఉందా ? విడిపోవడం వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ను ఎలా ఫేస్ చేస్తారు ? ఇలాంటి అంశాలన్నింటినీ కౌన్సెలర్ అడిగి తెలుసుకుని సరైన సజెషన్ ఇస్తాడు. ఏ సమస్యకైనా ఒక్కరోజులో పరిష్కారం దొరకదు. అందువల్ల దీనికైనా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మ్యారేజ్ థెరపీ కూడా ఇంతే. ఒక్కసారే కాదు.. సమస్యను బట్టి ఎక్కువ సెషన్స్ అవసరమవ్వోచ్చు. అన్నింటికీ హాజరవుతూ సరైన నిర్ణయం తీసుకోవాలి. కలిసున్నా, విడిపోవాల్సి వచ్చినా అది ఇద్దరి వైపు మంచి చేసే నిర్ణయం అయ్యుండాలి.

ALSO READ : భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గకూడదా ? 

ఇద్దరి మధ్యా ప్రేమ ఉండి సమస్యలు ఉన్నవాళ్లకు, తమను తాము మార్చుకుని బంధాన్ని కొనసాగించాలనుకుంటున్న వాళ్లకు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మ్యారేజ్ థెరపీ ఉపయోగపడుతుంది.

ఇవే ప్రధాన సమస్యలు
మ్యారేజ్ థెరపీ ఎక్కువగా అవసరమయ్యే కొన్ని సమస్యలు. 1 పిల్లలు పుట్టకపోవడం 2. పిల్లల పెంపకం 3. తల్లిదండ్రుల బాధ్యత 4. వేధింపులు 5.వివాహేతర సంబంధాలు 6. తక్కువ ఆదాయం 7. కోపం, అసూయ 8. చిన్న వయసులో పెళ్లి 9. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్.