లక్కీ లేడీగా మారిన మీనాక్షి.. లిస్టులో మరో స్టార్ హీరో సినిమా

లక్కీ లేడీగా మారిన మీనాక్షి.. లిస్టులో మరో స్టార్ హీరో సినిమా

ఖిలాడీ(khiladi) బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh babu), వరుణ్ తేజ్(Varun tej) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అక్కినేని హీరో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆతరువాత మాస్ మహారాజ్ రవితేజతో ఖిలాడీ సినిమా చేసింది ఈ బ్యూటీ కానీ.. అడివి శేష్ తో హిట్2 మూవీతో లైమ్ లైట్ లోకి వచింది. అక్కడి నుండి వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకున్న మీనాక్షి, ఆ తరువాత వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ , వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లక్కీ లేడీగా మారిపోయింది. 

Also Read :- భగవంత్ కేసరి నుంచి అక్టోబర్ 4న రెండో సాంగ్‌‌ రిలీజ్

తాజా సమాచారం మేరకు ఈ అమ్మడు మరో స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీలో మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారని సమాచారం. ఈ సినిమా కోసం ముందుగా ప్రియా మోహన్ పేరు వినిపించింది కానీ.. ఇప్పుడు ఆ అవకాశాన్ని మీనాక్షి దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.