
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne nithin) మ్యాడ్(Mad) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan shankar) తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించింది. ఈ సినిమాతో నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమరిది కంటే..మ్యాడ్ సినిమాలో అశోక్ గా కనిపించి అందరికీ దగ్గరయ్యాడు.
ప్రస్తుతం నార్నే నితిన్ తన నెక్స్ట్ మూవీని..గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 టు బ్యానర్ లో ఆయ్ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఆయ్ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. గోదావరి బ్యాక్ డ్రాప్లో హృదయానికి హత్తుకునేలా మనసారా నవ్వుకునేలా రూపొందిన ఈ ఫన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను నచ్చే అంశాలన్నీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని జనసేన అడ్డా అయిన పిఠాపురం లో ఘనంగా చిత్ర యూనిట్ నిర్వహించింది.
ఇప్పటికే ఆయ్ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ కానుంది. అదే రోజున రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్, రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమాలు ఉన్నాయి. ఇన్ని భారీ సినిమాల మధ్య రానున్న ఆయ్ ఎలాంటి హిట్ కొడుతుందో అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. .
ఈ సినిమాలో నితిన్ కు జోడిగా సారిక నయన్ నటిస్తోంది.అచ్చ తెలుగు ఫోక్ సింగర్..రామ్ మిరియాల ఆయ్ సినిమాకు తనదైన బాణీలు అందిస్తున్న ఈ సినిమాతో నార్నే నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.