నలుపు అంటే అంత చులకన?.. ఆసక్తిగా‌‌‌ జిగర్తాండ డబుల్ ఎక్స్ ట్రైలర్

నలుపు అంటే అంత చులకన?.. ఆసక్తిగా‌‌‌ జిగర్తాండ డబుల్ ఎక్స్ ట్రైలర్

రాఘ‌‌‌‌వ లారెన్స్‌ (Raghava Lawrence)‌‌‌, ఎస్‌‌‌‌.జె.సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తోన్న మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్టోన్ బెంచ్ ఫిలింస్ (Stone Bench Films) బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్ ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. లారెన్స్‌‌‌‌ గన్‌‌‌‌ పట్టుకుని గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తుండగా..తనని హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమా చేసే ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌గా ఎస్‌‌‌‌.జె.సూర్య కనిపిస్తున్నాడు. 

'పాన్ ఇండియాలో..ఇప్పుడు వచ్చే సినిమాల్లో..అతని లాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి చూద్దాం’’ అంటూ ట్రైలర్ స్టార్ట్ అవ్వగా..'నలుపు అంటే అంత చులకనా నీకు..అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ రాగా..సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి’’ అనే మరోకరి గొంతు వినిపిస్తుంది. ‘‘తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ..గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను స్టైలిష్‌గా చూపించారు మేకర్స్. ఆ తర్వాత కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ సినిమాపై ఆడియాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. 

తొమ్మిదేళ్ల క్రితం కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘జిగర్తాండ’ (తెలుగులో ‘గద్దలకొండ గణేష్‌‌‌‌’) లోనూ కథ ఇదే. అయితే ఈసారి 1975 బ్యాక్‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే పీరియాడికల్ డ్రామాగా దీన్ని మార్చాడు దర్శకుడు. అందుకు తగ్గట్టే లారెన్స్, సూర్య వింటేజ్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సంతోష్ నారాయణన్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ స్కోరుతో సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రంలో నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోండగా..నవీన్ చంద్ర, దసరా మూవీ ఫేమ్ షైన్ టామ్ చాకోలు విలన్ పాత్రలో కనిపించారు. దీపావళి కానుకగా జిగర్తాండ మూవీ నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది.