తలైవార్ 171 కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్!..ఆసియాలోనే టాప్

తలైవార్ 171 కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్!..ఆసియాలోనే టాప్

రజినీకాంత్ (Rajinikanth), లోకేష్ కానగరాజ్ (Lokesh Kanagaraj )..ఈ కాంబోలో ఒక సినిమా పడితే బాగుంటుందని రజిని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ.. మేకర్స్ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ సెన్సేషనల్ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇటీవలే జైలర్ తో రజినీకాంత్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సన్ పిక్చర్స్ సంస్థ..రజినీకి మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

తలైవా171 మూవీ కోసం రజనీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ను అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కోసం ఏకంగా..రజినీ రూ.270 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో రజినీ ఆసియాలోనే అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్ గా నిలుస్తాడు. వయస్సు పెరిగే కొద్దీ..రజీని స్టామినా..ఆ స్వాగ్ అమాంతం పెరుగుతూ ఉండటంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్' ఇది కదా తలైవా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

రజినీకాంత్ కెరీర్ 171వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్టు కు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ న్యూస్ తెలియడంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబోలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.