బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి.. గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి..

బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి తినండి.. గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి..

చాల మంది కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందుతుంటారు. కొలెస్ట్రాల్ వల్ల  గుండె  సంబంధిత వ్యాధులు వస్తాయని భయపడే వారు ఉన్నారు. అయితే కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలు. ఒకటి గుడ్, ఇంకోటి బ్యాడ్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తంలో ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇది తగ్గాలంటే  రోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకోండి. పచ్చి వెల్లుల్లి కూడా తినొచ్చు.

 గ్రీన్ టీ తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది. ధనియాల కషాయం తాగితే ఇది కరుగుతుంది. మెంతి కషాయం తాగినా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

రక్త నాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినొచ్చు లేదా జ్యూస్ తాగొచ్చు. రోజూ యాపిల్ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ నివారించొచ్చు. ద్రాక్షలో ఉండే పొటాషియం బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

బీన్స్ లో ఉండే కాపర్, పొటాషియంలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. జామలో ఉండే ప్రత్యేక గుణాలు దీనిని దూరం చేస్తాయి. పుట్టగొడుగుల ఆహారం కూడా తీసుకోవచ్చు. ఓట్స్, సబ్జా గింజలు, పెసలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు.