Exam Season:   ఎనర్జీ స్నాక్స్.. పిల్లలు బాగా చదువుతారు.. అస్సలు నిద్ర రాదు..!

Exam Season:   ఎనర్జీ స్నాక్స్.. పిల్లలు బాగా చదువుతారు.. అస్సలు నిద్ర రాదు..!

పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా చదువుతున్నారు పిల్లలు. మధ్యాహ్నం తింటారు. మళ్లీ రాత్రి ఎప్పటికో కాని రారు. అలాంటప్పుడు సాయంత్రం పూట తేలికగా. జీర్ణమయ్యే బటర్ మిల్క్ బిస్కెట్స్, పిటా చిప్స్, వంటి స్నాక్స్ ఇస్తే వాళ్లు జరంత ఎక్కువ సేపు చదువుతారు.

పిటా చిప్స్ తయారీకి కావలసినవి

  • గోధుమ పిండి :ఒక కప్పు
  •  బేకింగ్ పౌడర్ : ఒక టీ స్పూన్
  • అలివ్ నూనె :రెండు టేబుల్​ స్పూన్లు.
  • కొత్తిమీర తరుగు :అర కప్పు
  • మిరియాల పొడి :రెండు టేబుల్ స్పూన్లు
  • నువ్వుల పొడి: రెండు టేబుల్ స్పూన్లు

పిటా చిప్స్  తయారీ విధానం

ముందుగా పిండిని ఒక గిన్నెలో తీసుకుని దానిలో బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలపాలి. ముద్దను అరగంట సేపు మూత పెట్టి ఉంచాలి. 

తర్వాత మందంగా రొట్టెలుగా చెయ్యాలి. స్టవ్ పై చపాతీ పెనం మీద రొట్టెలను అటూ ఇటూ తిరగేస్తూ సన్నని మంటపై కాల్చాలి. కొద్దిగా మెత్తగా కాల్చాలి.  

కాల్చిన రొట్టెలను డైమండ్ ఆకారంలో కోసి ఒక ప్లేటులో పెట్టాలి.  ఒక గిన్నెలో ఆలివ్​ నూనె పోసి దానిలో కొత్తిమీర తరుగు, మిరియాలపొడి, నువ్వులపొడి వేసి కలిపి ఆ మిశ్రమాన్ని కోసిన రొట్టె ముక్కలపై అద్దాలి. 

తర్వాత వాటిని బేకింగ్ గిన్నెలో పెట్టి ఒవెన్ పెట్టాలి. వాటిని పదినిమిషాలపాటు 45 డిగ్రీల సెల్సియస్​ లో  వేడి చేస్తే పిటా చిప్స్ రెడి.  వీటిని తేనె లేదా చీజ్​తో తింటే సూపర్.   పిల్లలు వీటిని ఇష్టంగా ఉంటారు


బటర్​ మిల్క్​​ బిస్కెట్స్​ తయారీకి కావాల్సినవి

  • చల్లని మజ్జిగ: ఒక కప్పు
  • మైదా లేదా మొక్కజొన్న పిండి: రెండు కప్పులు 
  • వెన్న: అర కప్పు 
  • బేకింగ్ పౌడర్: ఒక టి స్పూన్
  •  ఉప్పు: తగినంత

బటర్​ మిల్స్​ బిస్కెట్స్  తయారీ విధానం

 ఒక గిన్నెలో పిండి తీసుకోవాలి దానిలో బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. ఒక గిన్నెలో మజ్జిగ పోసి దానిలో వెన్న వేసి అది మజ్జిగలో   కలిసి పోయేటట్లు కలపాలి. 

అప్పుడు దానిలో పిండి వేసి ముద్దలా చెయ్యాలి. ఆ ముద్దను మందంగా బిస్కట్ల ఆకారాలుగా చెయ్యాలి. ఆ పిండితో సుమారు 30 బిస్కట్లు వస్తాయి. 

వాటిని బేకింగ్ గిన్నెలో పెట్టి ఒవెన్ లో పెట్టాలి 45డిగ్రీల సెల్సియస్ వేడితో పది నిమిషాల సేపు వేడిచేయాలి. అరగంటలో బటర్ మిటీ బిస్కెట్లు రెడీ అవుతాయి. 

వాటిని గాలి ప్రవేశంచని డబ్బాలో పెట్టి సాస్​ తో  కాని, జామ్​తో కాని పిల్లలకు ఇవ్వొచ్చు.. పిల్లలు చదువుకుంటూ తింటారు.  ఇది తేలికైన ఆహారం.. త్వరగా జీర్ణం అవుతుంది. 

 ఇవితింటే నిద్ర కూడా రాదు.  మరి ఇంకెందుకు ఆలస్యం.. పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న పిల్లలకు ఈ రెసీపీలు  చేసిపెట్టండి