ములుగులో విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్లు..

ములుగులో విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్లు..
  •     మంత్రి సీతక్క చొరవతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  •  

వెంకటాపూర్, వెలుగు: ములుగు నియోజకవర్గ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నివాస ప్రాంతాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చేందుకు రూ.3 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. నివాస ప్రాంతాల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రతాపరమైన సమస్యలను మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రమాదాల ముప్పును తగ్గించేలా విద్యుత్ లైన్లను మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి సీతక్క విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న మంత్రి సీతక్కకు ములుగు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.