ఖమ్మం టౌన్, వెలుగు : మున్నూరు కాపు కార్పొరేషన్ కు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలో జరిగిన జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీసీల్లో మున్నూరు కాపుల జనాభా ఎక్కువన్నారు. వి.హనుమంతరావు, డి.శ్రీనివాస్, కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య వంటి వారికి సీఎం పదవి పొందే అర్హత ఉన్నా చివరి నిమిషంలో చేజారిందన్నారు. 56 శాతం ఉన్న బీసీలంతా కలుపుకొని వెళ్తే రాజ్యాధికారం దక్కుతుందన్నారు.
రాష్ట్ర మంత్రి వర్గంలో మున్నూరు కాపులకు స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్త శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేందర్, నాయకులు మడూరి పూర్ణ, మెంతుల శ్రీశైలం, తోట రామారావు, తోట రమేశ్, పగడాల మంజుల, తోట సుజలా రాణి పాల్గొన్నారు.
