అబ్జార్బ్ చేశాకే నోటిఫికేషన్ ఇవ్వాలి.. టీజీసీహెచ్ఈ చైర్మన్కు వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల వినతి

అబ్జార్బ్  చేశాకే నోటిఫికేషన్ ఇవ్వాలి.. టీజీసీహెచ్ఈ చైర్మన్కు వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అబ్జార్బ్ చేసిన తర్వాతే కొత్త రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ లోధ్ ప్రభుత్వాన్ని కోరారు. 

సోమవారం టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్​కు.. ఆ సంఘం అధ్యక్షుడు రామేశ్వర్​రావుతో కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సైతం కాంట్రాక్ట్ లెక్చరర్లను అబ్జార్బ్ చేయాలని సిఫార్సు చేసిందని తెలిపారు. తక్షణమే 1,200 మంది కాంట్రాక్ట్  లెక్చరర్లను సర్వీసుల్లోకి తీసుకున్న తర్వాతే మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని వారు కోరారు.