తెలుగు వర్సిటీ పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ స్కాలర్లకు వన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ సబ్మిషన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్

తెలుగు వర్సిటీ పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ స్కాలర్లకు వన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ సబ్మిషన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్
  • థీసిస్ సమర్పణకు డిసెంబరు 31 దాకా గడువు 

హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ థీసిస్ సమర్పించని అభ్యర్థులకు ‘వన్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ సబ్మిషన్‌‌‌‌‌‌‌‌’ గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో 1987–88 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ పొంది, ఎంఫిల్‌‌‌‌‌‌‌‌ పార్ట్–1 లేదా ప్రీ-పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ పాసై సకాలంలో థీసిస్ సమర్పించలేకపోయిన స్కాలర్లకు ఈ అవకాశం వర్తిస్తుందని చెప్పారు.

అభ్యర్థులు ప్రవేశం పొందిన సంవత్సరం నుంచి వర్తించే అన్ని ట్యూషన్ ఫీజుల బకాయిలను క్లియర్ చేయాలని, వర్సిటీ నుంచి టీసీ తీసుకోని వారే ఇందుకు అర్హులని స్పష్టం చేశారు. గైడ్ అనుమతితో, ఒకవేళ గైడ్ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ గైడ్ అనుమతి తీసుకుని నిర్ణీత గడువులోగా గ్రంథాలను సమర్పించాలని సూచించారు.