ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా ఉన్న ఓం ప్రకాష్ మాథుర్ కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. బ్రజ్ మోహన్ రామ్ ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.

డాక్టర్ సుధా యాదవ్ కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. డాక్టర్ ధల్ సింగ్ బిసెన్ ఉత్తరాఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దుష్యంత్ గౌతమ్ సిక్కిం గవర్నర్‌గా నియమితులయ్యారు.

►ALSO READ | సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని అసెంబ్లీ తీర్మానం