ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారటం లేదు. లంచాలకు కక్కుర్తి పడి ఉద్యోగాలకు ఎసరుతెచ్చుకుంటున్నారు. లేటెస్టుగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటం సంచలనంగా మారింది. 2026 అక్టోబర్ 12న అబ్దుల్లాపూర్ మెట్ లో 20 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఇద్దరినీ ACB, CIU అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లేఅవుట్ కోసం జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. మొదట 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసి.. చివరకు 20 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు డబ్బులు స్వీకరిస్తుండగా మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు పట్టుబడ్డారు.
నిందితుల నుంచి లంచం ఏసీబీ అధికారులు సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. MRO, మండల సర్వేయర్లను అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.
