జంతర్ మంతర్ దగ్గర రచ్చ రచ్చ.. గేటు దూకిన కాక్రోచ్లు.. పోలీసుల ర్యాపిడ్ యాక్షన్

జంతర్ మంతర్ దగ్గర రచ్చ రచ్చ.. గేటు దూకిన కాక్రోచ్లు.. పోలీసుల ర్యాపిడ్ యాక్షన్

ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు జంతర్ మంతర్ ను ఢిల్లీ పోలీసులు డీనోటిఫై చేసిన క్రమంలో.. నిషేదాన్ని ఎత్తివేయాల్సిందిగా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఎప్పటిలాగే ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాలనే డిమాండ్ తో 2026 అక్టోబర్ 13న జంతర్ మంతర్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు వాతావరణం  ఉద్రిక్తంగా మారిపోయింది.

జంతర్ మంతర్ గేట్లు దూకడంతో  సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్  రాంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు అజింక్యా షిండేను సహా సీజేపీ మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టుకు ముందు సీజేపీ కార్యకర్తలు గేటు దూకుతూ జంతర్ మంతర్ కు ఎంటరైన వీడియోను రాంక ఎక్స్ లో పోస్ట్ చేశారు. హ్యాండ్ ఆఫ్ జంతర్ మంతర్.. అనే టైటిల్ తో జంతర్ మంతర్ ముట్టడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియో స్వయంగా తీసిన రాంక.. అరెస్టుకు సంబంధించిన విజువల్స్ పోస్ట్ చేశారు. 

జనతాదళ్ (యునైటెడ్) కార్యాలయం నుంచి సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్ గేటు దూకి ప్రవేశించారు. అలర్ట్ అయిన పోలీసులు అత్యంత వేగంగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

సౌరవ్ దాస్ కొందరు సహచరులతో కలిసి జంతర్ మంతర్ కు చేరుకున్నారు. వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాక.. ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేశారు .

జంతర్ మంతర్ కు పోలీసుల ఆదేశాలను కాదని ఎంటరైన వారిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఎఫైఐఆర్ నమోదు చేసి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

24 గంటల డెడ్ లైన్:

మరోవైపు జంతర్ మంతర్ ను  24 గంటల్లో రీస్టోర్ చేయాలని ఢిల్లీ పోలీసులకు డెడ్ లైన్ విధించింది కాక్రోచ్ పార్టీ. జంతర్ మంతర్ అందరిదీ, ఎవరైనా, ఎప్పుడైనా ధర్నాలు చేసుకునే కామన్ ప్లేస్ పై రిస్ట్రిక్షన్స్ పెడితే సహించేది లేదని సీజేపీ లీడర్ విజయ్ రెడ్డి హెచ్చరించారు. 

సీఈసీ రాజీనామా వరకు ఆందోళన ఆగదు:

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళన ఆగదని అన్నారు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే. ఇండియా కూటమి నిర్వహించిన మార్చ్ ఫర్ డెమొక్రసీ- చలో సుప్రీం కోర్టు ర్యాలీని సమర్ధిస్తున్నట్లు చెప్పారు.