ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదుల ప్రాణాలు పోయాయి..జమ్మూకాశ్మీర్‌ LOC దగ్గర ఘటన

ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదుల ప్రాణాలు పోయాయి..జమ్మూకాశ్మీర్‌ LOC దగ్గర ఘటన
  • సరిహద్దుగుండా భారత్‌లోకి చొరబాటుకు యత్నం 

పూంఛ్: జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పేలుడు చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ(కేజీ) సెక్టార్‌లోని సాత్వాల్-నాకి ప్రాంతంలో ఐఈడీ (ల్యాండ్‌మైన్) పేలి నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. 

భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రక్షణ వర్గాలు తెలిపాయి. మృతుల్లో లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) అగ్ర కమాండర్ కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. నివేదికల ప్రకారం మృతులను పీఓకేలోని పూంఛ్ జిల్లా, హాజీరా తాలూకాకు చెందిన మహమ్మద్ ఇష్తియాక్, మహమ్మద్ ఫైజాన్ (లష్కర్ కమాండర్), మహమ్మద్ వకాస్, మహమ్మద్ ఆసిమ్‌లని గుర్తించారు.