ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేస్తుందేమో..జంతర్ మంతర్ డీ నోటిఫై నిర్ణయంపై సీజేపీ ఫైర్

ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేస్తుందేమో..జంతర్ మంతర్ డీ నోటిఫై నిర్ణయంపై సీజేపీ ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ నిరసనల వేదిక జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీ-నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది అసమ్మతి గొంతుకలను అణచివేసే ప్రయత్నంలో భాగమేనని, భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇలాగే రద్దుచేసినా ఆశ్చర్యంలేదని ఆరోపించారు. 

జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీనోటిఫై చేయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హెచ్చరించారు. ప్రభుత్వానికి నిరసన వేదిక కంటే, ప్రజలు నిరసనను వ్యక్తం చేయడమనే భావనే ప్రధాన సమస్యగా మారిందని విమర్శించారు.

 జంతర్ మంతర్ ఇప్పటికే ఒక పోరాట వేదికగా మారిందని, దాని అధికారిక హోదాను రద్దు చేసినంత మాత్రాన ఆందోళనలు ఆగవని స్పష్టంచేశారు. ఈ ఉద్యమం కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు.

ప్రాథమిక హక్కులపై దాడి: సౌరవ్ దాస్

ప్రధాని నరేంద్ర మోదీ జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎందుకు భయపడుతున్నారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. నిరసన వేదిక భారత ప్రజలదని, ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రజలు, సంస్థలు, భాగస్వామ్య పక్షాలను సంప్రదించిందా అని నిలదీశారు.

 ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుత నిరసన ప్రాథమిక హక్కుపై జరిగిన దాడి అని అభివర్ణించారు.ప్రస్తుతం జంతర్ మంతర్ హోదాను ఎలాగైతే రద్దు చేశారో, రేపు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.