బాణసంచా నియంత్రణ పౌరుల బాధ్యత కూడా ..ఆంక్షలతో మాత్రమే మార్పురాదన్న సుప్రీం

బాణసంచా నియంత్రణ పౌరుల బాధ్యత కూడా ..ఆంక్షలతో మాత్రమే మార్పురాదన్న సుప్రీం

న్యూఢిల్లీ: పండుగల వేళ బాణాసంచా వినియోగంపై ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసేందుకు ‘బ్యాలెన్స్ డ్’ గా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఢిల్లీ- ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్ పరిధిలో శీతాకాలంలో తీవ్రమయ్యే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు బాణాసంచాపై ఆంక్షలు విధించాలని దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్యా బాగ్చీల ధర్మాసనం విచారణ చేపట్టింది. 

బాణాసంచా కాల్చడానికి రోజులో కొన్ని నిర్దిష్ట సమయాలను (పరిమిత వేళలను) మాత్రమే కేటాయించి, ప్రజలను నియంత్రిత పద్ధతిలో వేడుకలు జరుపుకోవాలని కోరేందుకు ఇంకా తగినంత సమయం ఉందని కోర్టు పేర్కొంది. 

‘మేము ఎవరి మత విశ్వాసాలనూ గాయపరచబోం, కానీ పర్యావరణ సమస్యల తీవ్రత దృష్ట్యా ఎలాంటి పరిష్కారాన్ని చూపవచ్చో పరిశీలిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం కోర్టు ఆంక్షల ద్వారానే మార్పురాదని, పౌరులు, ప్రజా సంఘాలు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.