సింహాసనం ఖాళీ చేయండి..కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది ..సీఈసీపై ఎంపీ శశి థరూర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సింహాసనం ఖాళీ చేయండి..కేంద్రంలో  ప్రభుత్వం కూలిపోతుంది ..సీఈసీపై ఎంపీ శశి థరూర్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పలు అంశాల్లో తరచూ మద్దతుగా వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో.. ‘సింహాసనం ఖాళీ చేయండి.. ప్రజలు వస్తున్నారు’ అంటూ హిందీ కవి రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధారీ సింగ్ దింకర్ కవితను కోట్ చేశారు. ‘ఈ ప్రభుత్వం కూలిపోతుంది’ అంటూ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ పెట్టారు. 

ఆందోళనల్లో స్టూడెంట్లు, మహిళలపై పోలీసుల చర్యలు, బీజేపీ కార్యకర్తల దాడులను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటివరకు నిరసనలకు దూరంగా ఉన్న థరూర్.. యువతకు పాఠాలు నేర్పినందుకు థ్యాంక్స్ అంటూ సెటైర్లు వేశారు. 

సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆయన.. ఈ ఘటనపై విచారణ జరపాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు.