హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు అధికారిక వెబ్‌సైట్లను రూపొందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 194 తెలంగాణ మోడల్ స్కూళ్లకు అధికారిక వెబ్‌సైట్ల ఏర్పాటుకు ఒక్కో స్కూల్కు రూ.5 వేల చొప్పున నిధులను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది.
ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మోడల్ స్కూల్ యాజమాన్యం రూ.5 వేల పరిమితికి మించకుండా, ఆర్థిక నిబంధనలకు లోబడి అధికారిక వెబ్‌సైట్‌ను డెవలప్ చేసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. స్కూల్ సమాచారం, అడ్మిషన్లు, ఫలితాలు తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
