చండీగఢ్: పంజాబ్‌లో స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రాసెస్ పూర్తయ్యింది. మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ నిర్వహించగా..తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు సోమవారం రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం..లిస్టులో మొత్తం13.60 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి.
అదే టైంలో కొత్తగా 7.97 లక్షల మంది కొత్త ఓటర్ల పేర్లను చేర్చారు. దాంతో పంజాబ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,01,00,727 కు చేరింది. ఇంకా పేరు నమోదు చేసుకోని అర్హులైన ఓటర్లు ఆన్‌లైన్‌లో గానీ, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) ద్వారా గానీ ఫారమ్ 6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు
