Food: బ్రకోలి పలావ్.. గుమగుమలాడే హెల్దీఫుడ్.. ఇది తింటే స్వర్గంలో ఉన్న ఫీలింగ్..!

Food:  బ్రకోలి పలావ్.. గుమగుమలాడే  హెల్దీఫుడ్.. ఇది తింటే స్వర్గంలో ఉన్న ఫీలింగ్..!

బ్రకోలి ఈ పేరు వింటే చాలు జనాలు ఆమడ దూరంపరిగెత్తుతారు.  ఎంతటి ఆరోగ్యమైన.. బలవర్దకమైన ఫుడ్​ అయినా సరే  తినడానికి అస్సలు ఇష్టపడరు.  కాని దీనిని చేయాల్సిన రీతిలో  పలావ్​ చేస్తే చాలు లొట్ట లేసుకుంటూ లాగించేస్తారు.  ముద్ద ముద్దకు స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందుతాను.  మరి ఈ బ్రకోలి పలావ్​ను ఎలా తయారు చేయాలి.. ఏమేమి పదార్ధాలు కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

బ్రకోలి పలావ్​ తయారీకి కావలసినవి

 

  •  బ్రకోలి - 200 గ్రాములు 
  • ఉడికించిన సోనా మసూరి అన్నం - 6 కప్పులు 
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్ (చివర్లో మరో  టీస్పూన్) 
  • జీడిపప్పులు - 16
  • ఉల్లిపాయ ముక్కలు -  ఒక కప్పు 
  • పచ్చిమిర్చి - 6
  • వెల్లుల్లి రెబ్బలు - 4 
  • పసుపు -అర టీస్పూన్ 
  • గరం మసాలా - 2 టీస్పూన్లు
  • మిరియాల పొడి - అర  టీస్పూన్ 
  • కిచెన్ కింగ్ మసాలా - 2 టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా 
  • నిమ్మరసం -  ఒక టీస్పూన్ 
  • నువ్వుల నూనె - కొద్దిగా 

బ్రకోలి పలావ్​ తయారీ విధానం


ముందుగా   సోనా మసూరి అన్నంలో కొద్దిగా నువ్వుల నూనె వేసి   ఒక వెడల్పాటి గిన్నెలో ఆరపెట్టాలి.  నువ్వుల నూనె వేయడం వలన అన్నం ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది.   ఇప్పుడు స్టవ్​ పై ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లను మరిగించి ఆవిరి వచ్చేలా ఉండాలి.  ఈ ఆవిరిలో బ్రకోలి ముక్కలను 5 నిమిషాలపాటు ఆవిరిపై మరీమెత్తగా కాకుండా కాస్త క్రిస్పీగా ఉండేలా  ఉడికించాలి.  బ్రకోలి ఉడికిన నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరల స్టవ్ వెలిగించి మందంగా.. వెడల్పుగా ఉన్న కళాయిని వేడి చేయాలి.  అందులో రెండు టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. వేడిగా ఉన్న నెయ్యిలో జీడిపప్పులను దోరగా వేయించి ఒక బౌల్​ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు.. వెల్లుల్లి రెబ్బలు.. పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ దోరగా వచ్చే వరకు వేగిన తరువాత అందులో గరం మసాలా, కిచెన్​ కింగ్ మసాలా, మిరియాల పొడి, పసుపు వేసి మంటను పూర్తిగా స్విమ్​ లో ఉంచాలి. ఓ రెండు నిమిషాల పాటు వేయిస్తూ పచ్చి వాసన పోయేలా కలుపుతూ ఉండాలి.  రుచికి సరిపడ ఉప్పును వేయాలి. 

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఆవిరిపై ఉడికించిన బ్రకోలి ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు మసాలా పట్టేలా కలపాలి.   ఆ తరువాత  చల్లార్చిన అన్నాన్ని వేసి ఈ మిశ్రమంలోని మసాలాలన్నీ అన్నానికి పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

ఇందులో రుచిగా ఉండేందుకు  నిమ్మరసం, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, మరో అర టీస్పూన్ నెయ్యి పైన వేసి బాగా కలపాలి.  ఇక -అంతే గుమగుమలాడే వేడివేడి బ్రకోలి పలావ్ రెడీ. దీనిని కమ్మటి పెరుగు రైతాతో కానీ, ఇష్టమైన కుర్మాతో తింటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.