ఖిలా వరంగల్, వెలుగు : ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు, ఆధునిక బ్యాంకింగ్ వసతులను కల్పించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఆత్మకూరు శాఖ కొత్త భవనంలోకి మారింది.
సోమవారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజినల్ మేనేజర్ రిషికేశ్ రంజన్ కుమార్ ప్రారంభించి, మాట్లాడారు. ఖాతాదారుల సౌకర్యార్థం విశాలమైన ప్రాంగణంలో, ఆధునిక డిజిటల్ సదుపాయాలతో ఈ శాఖను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎం.ప్రసాదరావు, పవన్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ ఎం.అనుపమ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
