హార్దిక్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇండియా స్కోర్...

హార్దిక్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇండియా స్కోర్...

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడుతోంది టీం ఇండియా. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ తడబడింది. ఒక్క ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ మినహా బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలో దిగిన ఇషాన్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 5వ వికెట్ గా బరిలో దిగిన హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 52 రన్స్ సాధించాడు. 

హార్దిక్ హాఫ్ సెంచరీ చేయడంతో టీం ఇండియా స్కోర్ 200 దాటింది.ఎరాస్మస్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు హార్దిక్ పాండ్య. ప్రస్తుతం 18.2 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది టీం ఇండియా. మరి, పసికూన ముందు భారీ టార్గెట్ ఉంచిన టీం ఇండియా బౌలింగ్ తో ఆకట్టుకొని విజయ పరంపర కొనసాగిస్తుందో లేదో చూడాలి.