Vikram Monkey: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్.. చియాన్ ఇంటికెళ్లిన వైల్డ్‌లైఫ్ అధికారులు

Vikram Monkey: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్.. చియాన్ ఇంటికెళ్లిన వైల్డ్‌లైఫ్ అధికారులు

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన తన ఇంట ఓ విదేశీ అరుదైన కోతి (Lar Gibbon) తో సరదాగా గడుపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అది కాస్తా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో విక్రమ్ ఎంతో ఆప్యాయంగా ఆ జంతువుతో ఆడుకోవడం చూసి అభిమానులు ముచ్చటపడ్డారు. కానీ, అటవీ శాఖ రంగప్రవేశం చేయడంతో విక్రమ్ ఆ వీడియోను 24 గంటల్లోపే డిలీట్ చేశారు. ఇంతకీ ఈ మంకీ ఎవరిదీ? వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు ఏం గుర్తించారు? ఈ వన్యప్రాణిని చెన్నైకి ఎలా తీసుకొచ్చారు? అనే వివరాలు తెలుసుకుందాం.. 

అసలు సమస్య తెరపైకి..

వైరల్ అవుతున్న ఆ వీడియోలో విక్రమ్ ఎంతో ఆప్యాయంగా ఆ జంతువుతో ఆడుకోవడం చూసి అభిమానులు మొదట ముచ్చటపడ్డారు. కానీ, అది అంతర్జాతీయంగా సంరక్షించబడుతున్న అరుదైన 'లార్ గిబ్బన్' (Lar Gibbon) జాతికి చెందిన కోతి అని, దాన్ని పెంచుకోవడం చట్టవిరుద్ధమని కొందరు జర్నలిస్టులు, వైల్డ్ లైఫ్ ఆక్టివిస్టులు బయటపెట్టడంతో అసలు సమస్య తెరపైకి వచ్చింది. ఈ వివాదం విక్రమ్ వియ్యంకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, కేవిన్‌కేర్ (CavinKare) వ్యవస్థాపక ఛైర్మన్ సీకే రంగనాథన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

విక్రమ్ కూతురు అక్షిత భర్త మను రంజిత్ తండ్రియే ఈ సీకే రంగనాథన్. నివేదికల ప్రకారం.. ఇండోనేషియాకు చెందిన ఈ అరుదైన వన్యప్రాణిని ఆగ్నేయాసియా నుంచి మణిపూర్ మీదుగా తమిళనాడులోని ఈరోడ్‌కు అక్రమంగా తరలించి, అక్కడి నుంచి చెన్నైలోని రంగనాథన్ నివాసానికి చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం వైరల్ అవ్వడంతో విక్రమ్ ఆ వీడియోను 24 గంటల్లోపే డిలీట్ చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "భారతదేశంలో చట్టాలు కేవలం పేదలకేనా? ధనవంతులకు వర్తించవా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైల్డ్‌లైఫ్ అధికారుల రియాక్షన్..

ఈ వ్యవహారంపై స్పందించిన చెన్నై వైల్డ్‌లైఫ్ వార్డెన్ యోగెన్ కులాల.. నేరుగా సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంచలనం సృష్టిస్తున్న ఈ ‘లార్ గిబ్బన్’ (Lar Gibbon) అంతర్జాతీయ వన్యప్రాణి వాణిజ్య నియంత్రణ చట్టం (CITES) పరిధిలోకి వస్తుంది. అలాగే భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా ఈ జంతువుకు రక్షణ ఉంది. తగిన పత్రాలు, అనుమతులు లేకుండా ఇలాంటి అరుదైన విదేశీ వన్యప్రాణులను పెంచుకోవడం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అధికారికంగా విచారణ ప్రారంభించారు. ‘లార్ గిబ్బన్‌’ను ఇంట్లో పెంచేందుకు అవసరమైన అనుమతులు, సంబంధిత పత్రాలు ఉన్నాయా? లేదా? అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జంతువును ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, దానికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : Rahul Sipligunj : ఆంధ్రాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు

ఈ కేసులో విచారణ పూర్తయ్యే కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై నటుడు విక్రమ్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikram (@the_real_chiyaan)