కొలంబోలో తెగ కష్టపడుతున్న భారత ఆటగాళ్లు.. మరో 4 రోజుల్లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ స్టార్ట్!

కొలంబోలో తెగ కష్టపడుతున్న భారత ఆటగాళ్లు.. మరో 4 రోజుల్లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ స్టార్ట్!

IND vs SL Test Series: ఆగస్టు 15వ తేదీన శ్రీలంకతో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు సన్నాహకాలను మరింత వేగవంతం చేసింది. రోజుకు 90 ఓవర్ల చొప్పున 3 రోజుల వార్మప్ మ్యాచ్ పూర్తయినప్పటికీ, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆటగాళ్లు సోమవారం ఉదయం కొలంబోలోని ఎన్‌సీసీ (NCC) మైదానంలో ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు. జట్టు బస్సు మైదానానికి చేరుకున్న వీడియోలు, ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కొలంబో వేడిలో ప్లేయర్ల స్వెట్ ఔట్: 
కొలంబోలోని విపరీతమైన వేడి, తేమ (Humid) వాతావరణానికి త్వరగా అలవాటుపడేందుకే భారత జట్టు ఈ అదనపు ప్రాక్టీస్ సెషన్‌ను సెలక్ట్ చేసుకుంది. నెట్స్‌లో గంటల తరబడి శ్రమించిన తర్వాత క్రీడాకారులు అలసిపోయి మైదానంలోనే విశ్రాంతి తీసుకుంటూ, డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మ్యాచ్ సమయానికి వాతావరణ పరిస్థితులకు సంపూర్ణంగా సిద్ధమవ్వడంతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో కనిపించిన లోపాలను సరిదిద్దుకోవడంపై కోచింగ్ స్టాఫ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 

ALSO READ : నిన్ను, నీ భార్యని చంపేస్తాం: సౌరవ్ గంగూలీ దంపతులకు ప్రాణహాని.. 

జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ:
ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో లేట్ రిప్లేస్‌మెంట్‌గా ఎంపికైన స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టు క్యాంప్‌లో చేరాడు. జట్టు సభ్యులతో కలిసి అతడు కూడా నెట్స్‌లో చెమటోడ్చాడు. సర్ఫరాజ్ ఆగమనం భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆప్షన్లను మరింత బలోపేతం చేసింది.