పార్లమెంట్ బయట ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనలు...

పార్లమెంట్ బయట ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనలు...

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం హోరెత్తింది. మంగళవారం ( ఆగస్టు 11 ) పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలకు దిగారు ఇరుపక్షాల ఎంపీలు. జార్ఖండ్ లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై సమాధానం చెప్పాలని.. అమిత్ షా సభలో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ సభలోనే ఉండాలంటూ ఎన్డీయే ఎంపీలు నిరసన చేపట్టారు.

జులై 20న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్, అయోధ్య రామ మందిర చందా చోరీ అంశాలపై సమాధానం చెప్పాలంటూ ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.మకర్ ద్వార్ వరకు ర్యాలీ చేపట్టిన ఎంపీలు విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు ఎన్డీయే ఎంపీలు.

ఎన్డీయే ఎంపీలు ర్యాలీ చేపట్టిన సమయంలోనే విపక్షాల ఎంపీలు కూడా నిరసనకు దిగారు. సభను అడ్డుకున్నారంటూ ఎన్డీయే ఎంపీలు నినాదాలు చేశారు. చర్చకు రావాల్సింది పోయి.. పారిపోతున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనాలంటూ  డిమాండ్ చేశారు.