టీ20 వరల్డ్ కప్ లో రెండో మ్యాచ్ లో భాగంగా నమీబియాతో తలపడుతోంది టీం ఇండియా. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగింది టీం ఇండియా. పసికూన నమీబియా ముందు భారీ టార్గెట్ ఉంచడమే లక్ష్యంగా బరిలో దిగిన ఇండియా రెండో ఓవర్లోనే ఫస్ట్ వికెట్ క్లొపోయింది. అభిషేక్ శర్మ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ 8 బాల్స్ లో 22 రన్స్ చేసి బెన్ శికాంగో బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత బరిలో దిగిన ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ ఏడో ఓవర్లో గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 24 బాల్స్ లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు బాదిన ఇషాన్ కిషన్ 61 రన్స్ సాధించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలో దిగిన కెప్టెన్ సూర్యకుమార్ కూడా నిరాశ పరిచాడు. 13 బాల్స్ లో 12 రన్స్ చేసి బెర్నాల్డ్ బౌలింగ్ లో స్టంపింగ్ గా వెనుదిరిగాడు సూర్యకుమార్.
►ALSO READ | టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా.. భారత్ స్క్వాడ్ లో కీలక మార్పులు..!
తిలక్ వర్మ కూడా 21 బంతుల్లో 25 పరుగులు చేసి ఎరాస్మస్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్య బరిలో దిగగా 12 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 124 రన్స్ చేసింది టీం ఇండియా.
